సంగీత దర్శకురాలు యం యం శ్రీలేఖ కు 'కళారత్న' పురస్కారం

  • IndiaGlitz, [Sunday,March 18 2018]

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ నాడు ఇచ్చే ప్రతిష్టాత్మక 'కళారత్న ' పురస్కారం ఈ సంవత్సరం ప్రముఖ సంగీత దర్శకురాలు యం యం శ్రీలేఖ  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా, అందుకున్నారు.

12వ యేటనే సినిమాలకు సంగీత దర్శకత్వం అందించడం మొదలుపెట్టిన శ్రీలేఖ, ఇంతవరకు 5 భాషలలో, 75 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ఏకైక మహిళా సంగీతదర్శకురాలిగా రికార్డు సృష్టించారు.  దాసరి నారాయణరావు గారి 'నాన్నగారు ' సినిమాతో మొదలైన సంగీత ప్రస్థానం, మూవీ మొఘల్ రామానాయుడు గారి 'తాజ్ మహల్ ', ధర్మ చక్రం (వెంకటేష్) వంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు, ప్రేమించు లాంటి సందేశాత్మక చిత్రాలకు సంగీతం అందిస్తూ, మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా పేరు తెచ్చుకున్నారు.  తన సంగీత దర్శకత్వంలో మొదటి పాట రచన చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కూడా ఇదే సంవత్సరం 'కళారత్న ' పురస్కారం  అందుకోవడం ఒక అదృష్టం అని యం యం శ్రీలేఖ అన్నారు.

More News

'జంబ ల‌కిడి పంబ‌' లోగో విడుద‌ల చేసిన అల్ల‌రి న‌రేశ్‌

శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై

ఏప్రిల్ లో విడుదలకు సిద్దమవుతున్న 'కృష్ణం'

పి.ఎన్‌.బి. క్రియేష‌న్స్ ప‌తాకంపై యదార్ధ సంఘటనల ఆధారాంగా తెలుగు, మలయాళం, తమిళ్ భాషల్లో

అమరావతిలో అంగరంగ వైభవంగా 'శబ్ధం' ప్రారంభోత్సవం

యువ కథానాయకుడు నారా రోహిత్ ప్రధాన పాత్రలో పి.బి.మంజునాధ్ దర్శకత్వంలో

ఉగాది శుభాకాంక్ష‌ల‌తో నివాసి

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి ఫ్యామిలి ఎమోష‌న‌ల్ చిత్రంతో హీరొగా ప‌రిచ‌యం అయ్యి,

అప్పుడు - ఇప్పుడు ఫస్ట్ లుక్ విడుదల

యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషా రాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు సంయుక్తంగా నిర్మిస్తొన్న చిత్రం 'అప్పుడు- ఇప్పుడు'