తనపై వస్తున్న విమర్శలకు కీరవాణి ట్వీట్స్

  • IndiaGlitz, [Tuesday,April 04 2017]

బాహుబ‌లి ప్రి రిలీజ్ వేడుక‌లో తెలుగుపాట అంప‌శ‌య్య‌పై ఉంద‌ని సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి చేసిన వ్యాఖ్య‌ల‌కు చాలా మంది నెగ‌టివ్‌గా రియాక్ట్ అయ్యారు. ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌రద్వాజ కీర‌వాణి అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటూ ఓ వీడియోలో చెప్పారు. దీనిపై కీర‌వాణి మ‌ళ్ళీ త‌న‌దైన శైళిలో ట్విట్ట‌ర్స్‌లో స‌మాధానం చెప్పాడు.

మ‌నం ఎప్ప‌టికీ విద్యార్థుల‌మే, త‌ప్పులు చేస్తుంటాం. త‌మ్మారెడ్డి భ‌రద్వాజ్ వంటివారే ఆ త‌ప్పుల‌ను స‌రి చేయ‌గ‌ల‌రు.

ఐదు నిమిషాల్లో బుర్ర‌లేని నా మ‌తిని త‌మ్మారెడ్డిగారు వాష్ చేశారు.

మీ స‌ల‌హాను త‌ప్ప‌కుండా పాటిస్తా త‌మ్మారెడ్డి భ‌రద్వాజ్ గారు..నేను ట్వీట్‌లో మోస్ట్‌లీ అనే ప‌దం ఎక్కువగా వాడాను. ఆ ప‌దం చాలా మందిని బాధ పెట్టింది. త‌మ్మారెడ్డిగారి స‌ల‌హా పై ఆ ట్వీట్‌ను తొల‌గించాను.

ద‌ర్శ‌కులంద‌రూ మేధావుల‌ని నాకు అర్థం అయ్యింది. నేనే తెలివి త‌క్కువ వాడిని.

ప్ర‌పంచంలోని ద‌ర్శ‌కులంద‌రితో నేను ప‌నిచేయాల‌నుకుంటున్నాను. అంద‌రూ గొప్ప‌వారే. అయితే నేనే బ్రెయిన్ లెస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని కాబ‌ట్టి నాకు తక్కువ‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని అనుకుంటున్నాను.

నాకు ఎవ‌రో ఓ డిక్ష‌న‌రీ పంపారు. అందులో పొగ‌రుకి అర్థం ఎం.ఎం.కీరవాణి అనే అర్థం ఉందట‌. ఆ పుస్త‌కాన్ని నేను పూర్తిగా చ‌దువుతాను.

నాకు పాట‌ల ర‌చయిత‌లంద‌రూ ఇష్ట‌మే. అంద‌రూ క‌ష్ట‌ప‌డి పాట‌లు రాస్తున్నారు. వాళ్ళ‌ను నేను ఎలా మ‌ర‌చిపోతాను.(ఎందుకంటే నేను వృధ్ధుణ్ణి అయిపోయాను)

వేటూరిగారికి 100, సీతారామ‌శాస్త్రిగారికి 90, మా నాన్న‌గారికి 35, నాకు 10 మార్కులేన‌ని నా అభిప్రాయం. మిగ‌తా వారంద‌రూ 11 నుండి 89 మార్కుల మ‌ధ్య‌లో ఉంటారు.

ఇటీవ‌ల సాయిగారు ఓ ప్రోగ్రామ్ చూసి టాలీవుడ్‌లో కంపోజ‌ర్స్ కొర‌త ఉంద‌ని అన్నారు. నేను వ్య‌తిరేకించి ఆయ‌న్ను ఎడ్యుకేట్ చేశాను.

నిజానికి రైట‌ర్స్ కొర‌త అధికంగా ఉంది. కానీ వారికి త‌క్కువ పారితోషకం ఇస్తున్నారు. నేను బంధుప్రీతిని న‌మ్ముతాను. నా 30 ఏళ్ళ అనుభవంలో నాన్న‌గారు నాకు 20 పాట‌లు రాశారు. చంద్ర‌బోస్ నాకు బావ ఆయ‌న నా కోసం చాలా పాట‌ల‌ను రాశారు.

అనంత్ శ్రీరాం పాట‌లు రాయ‌డం మానేద్దామ‌ని అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్ర‌తి ఒక్క‌రూ పాట‌లు రాస్తున్నారు. దాంతో ప్ర‌తిభ ఉన్న‌వారికి అవ‌కాశాలు త‌గ్గుతున్నాయి. డ్యూయెట్స్‌, ఐటెం సాంగ్స్, హీరోలు, హీరోయిన్స్‌, సింగ‌ర్స్ వీళ్ళంతా పాట‌లు రాసేస్తున్నార‌ని అనంత శ్రీరాం అన్నారు.

తెలుగు సినీ సాహిత్యం అంప‌శయ్య‌పై లేవు కానీ అనంత‌శ్రీరామ్ మాత్రం సంక్షోభంలో ఉన్నాడు.

రాజ‌మౌళి నాపై కోపంగా ఉన్నాడు. బాహుబ‌లి 2 వ‌ర్క్‌ను పూర్తి చేయ‌మ‌ని తొంద‌ర పెడుతున్నాడు. ఎందుకంటే ఆర్కా మీడియా వారు సినిమాను ఏప్రిల్ 28న విడుద‌ల చేయాల‌ని అనుకుంటోంది.. మ‌ళ్ళీ క‌లుద్దాం మిత్రులారా..