MLC Ramachandraiah: వైసీపీకి వరుస షాకులు.. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య..

  • IndiaGlitz, [Wednesday,January 03 2024]

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇక తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, దాడి వీరభ్రదరావు కూడా టీడీపీలో చేరారు. చంద్రబాబు వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇక వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ రెడ్డి కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కడప జిల్లాకు చెందిన ద్వారకానాథ రెడ్డి స్వయానా నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి మేనమామ. దీంతో విజయసాయిరెడ్డి, ఆయన భార్య సునందరెడ్డి మినహా కుటుంబ సభ్యులందరూ టీడీపీలోనే ఉన్నారు. గతంలో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు రాయచోటి ఎమ్మెల్యే టికెట్ కన్ఫార్మ్ అయిందని తెలుస్తోంది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అప్పులపాలు చేశారని విమర్శల వర్షం కురిపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి జగన్‌కు చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. తన లాగే వైసీపీలో ఎంతో మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వారందరూ త్వరలోనే బయటకు వస్తారని తెలిపారు.

More News

ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. బ్రదర్ అనిల్‌తో బీటెక్ రవి భేటీ..

ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఎప్పుడూ ఎలాంటి పరిణామం జరుగుతుందో ఊహించడం రాజకీయ విశ్లేషకులకు కూడా కష్టమవుతోంది.

YS Jagan: ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. వివాదాస్పద నేతలకు చెక్‌..

ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు దూకుడుగా ప్రవరిస్తూనే మరోవైపు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటు సామాజిక వర్గాల లెక్కలు..

YS Jagan: కుటుంబాలను చీల్చే కుట్రలు.. షర్మిలపై జగన్ పరోక్ష వ్యాఖ్యలు..

ఏపీ సీఎం జగన్(CM Jagan) తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సోదరి వైయస్ షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో పరోక్షంగా స్పందించారు.

‘రాఘవ రెడ్డి’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది - హీరో శివ కంఠమనేని

శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో

Gautham Adani: హిండెన్‌ బర్గ్‌ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అదానీకి భారీ ఊరట..

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Adani)కి సుప్రీంకోర్టు(Supreme Court)లో భారీ ఊరట లభించింది. హిండెన్ బర్గ్(Hindenburg) నివేదికపై సెక్యూరిటీస్