MLC Kavitha:తీవ్ర అస్వస్థతతో స్పృహతప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్ కుమార్ గెలుపు కోసం ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆమె బాగా నీరసించిపోయి, కళ్లు తిరిగి పడిపోయారు. తోటి కార్యకర్తలు వెంటనే ఆమెను చెట్టు కిందకు తీసుకువెళ్లి సపర్యలు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్‌కు గురై కవిత అస్వస్థతకు గురైనట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు.
మూడు రోజులుగా కవిత ఎన్నికల ప్రచారంంలో పాల్గొంటున్నారని.. గ్యాప్ లేకుండా ప్రచారం చేస్తున్నందువల్లే ఆమె నీరసంతో అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ స్వతహాగా డాక్టర్ కావడంత ఆమెను పరిశీలించి ప్రాథమిక చికిత్స చేయడంతో కోలుకుని తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. కాగా తెలంగాణ ఎన్నికల ప్రచారం ఈసారి హోరాహోరిగా సాగుతున్న సంగతి తెలిసిందే. నువ్వానేనా అనే రీతిలో అన్ని పార్టీల నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెగ కష్టపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com