జగన్ వంద రోజుల పాలనలో వంద తప్పటడుగులు
- IndiaGlitz, [Sunday,September 01 2019]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలనపై విమర్శలు గుప్పించారు టీడీపీ నాయకులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. జగన్ వంద రోజుల పాలన వంద తప్పటడుగులు.. వంద తడబాట్లుగా ఉందని విమర్శించారు. చంద్రబాబు నాయుడిపై కక్ష సాధించేందుకు అన్ని రకాలుగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో మధ్యతరగతి ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు.
100 రోజులుగా కార్మికులకు ఉపాధి దూరం చేసిన జగన్ సర్కార్.... వారిని ఏవిధంగా ఆదుకుంటారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు డొక్కా. జగన్ పాలనలో ప్రచార ఆర్భాటాలే కనిపిస్తున్నాయి తప్పా... ప్రజల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇసుక టెండర్లను వైసీపీ నేతలకు మాత్రమే అప్పగించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా జగన్ తన విధివిధానాలను మార్చుకోవాలని.. లేదంటే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.