అసెంబ్లీలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు.. కేటీఆర్ గైర్హాజరు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. ముందుగా సభా నాయకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం మిగిలిన ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం కేసీఆర్కు సర్జరీ జరగడంతో ఆయన సభకు హాజరుకాలేని పరిస్థితి. అలాగే కేసీఆర్కు తోడుగా ఆసుపత్రిలో ఉన్నందున కేటీఆర్ కూడా ప్రమాణ స్వీకారానికి రాలేదు.
ఇక బీజేపీ ఎమ్మెల్యేలు అయితే తొలిరోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేయడంతో ఆయన ముందు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయమని తెలిపారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. రెగ్యులర్ స్పీకర్ వచ్చాకే ప్రమాణం చేస్తామని తేల్చిచెప్పారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల ప్రమాణం పూర్తి కావడంతో స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపికయ్యారు. కాగా కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. మిత్రపక్షమైన సీపీఐకి ఒక స్థానం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 39, బీజేపీకి 8, ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో స్పీకర్, ఎంపిక లాంఛనమే కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com