అసెంబ్లీలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు.. కేటీఆర్ గైర్హాజరు..

  • IndiaGlitz, [Saturday,December 09 2023]

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేయించారు. ముందుగా సభా నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం మిగిలిన ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ జరగడంతో ఆయన సభకు హాజరుకాలేని పరిస్థితి. అలాగే కేసీఆర్‌కు తోడుగా ఆసుపత్రిలో ఉన్నందున కేటీఆర్ కూడా ప్రమాణ స్వీకారానికి రాలేదు.

ఇక బీజేపీ ఎమ్మెల్యేలు అయితే తొలిరోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడంతో ఆయన ముందు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయమని తెలిపారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. రెగ్యులర్ స్పీకర్ వచ్చాకే ప్రమాణం చేస్తామని తేల్చిచెప్పారు.

ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల ప్రమాణం పూర్తి కావడంతో స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎంపికయ్యారు. కాగా కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. మిత్రపక్షమైన సీపీఐకి ఒక స్థానం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 39, బీజేపీకి 8, ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో స్పీకర్, ఎంపిక లాంఛనమే కానుంది.

More News

BRS LP నేతగా కేసీఆర్.. అసెంబ్లీని బహిష్కరించిన బీజేపీ..

బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎ కేసీఆర్‌ ఎంపికయ్యారు. తెలంగాణ భవన్‌లో సీనియర్ నేత కేశవరావు అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ మేరకు తీర్మానం చేశారు.

Sonia Gandhi Birthday: గాంధీభవన్‌లో ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు హైదరాబాలోని గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి,

Telangana Ministries: తెలంగాణ మంత్రులకు శాఖల వివరాలు ఇవే..

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం..

Akbaruddin Owaisi: తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ

తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభాకానున్నాయి. నాలుగురోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికలైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది.

Bigg Boss Telugu 7: శోభాపై శివన్న చిందులు, అమర్‌పైనా ఫైర్

బిగ్‌బాస్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఓటు అప్పీల్ టాస్క్‌లు నడుస్తున్నాయి. అయితే అమర్‌దీప్ వ్యవహారశైలి ఎందుకో గాడి తప్పింది.