పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య.. ఎట్టకేలకు వనమా రాఘవ అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం తెలుగు నాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవేంద్రరావును కొత్తగూడెం పోలీసులు గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో దుమారం రేపింది. అందులో తన నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు. ఆ సందర్భంగా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దని ఆయన సూచించారు. డబ్బు రూపంలో ఎంత అడిగినా ఇచ్చేవాడిని.. కానీ ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. పిల్లలు లేకుండా తన భార్యను హైదరాబాద్‌కు ఒంటరిగా తీసుకురావాలని కోరాడంటూ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ భార్యను నా దగ్గరికి పంపిస్తే నువ్వు అడిగిన పని చేసి పెడతా.. లేకపోతే ఎవ్వరూ నీకు సాయం చేయరని రాఘవ బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు... నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో వాపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా.. నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలు సాహితి, సాహిత్యపై సోమవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి తానూ నిప్పటించుకున్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా.. 80శాతం గాయాలతో తీవ్రంగా గాయపడిన సాహితి ఆస్పత్రిలో మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి బుధవారం కన్నుమూసింది. తొలుత ఈ కేసును ప్రమాదంగా, ఆత్మహత్యగా భావించారు. కానీ రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్‌లో వనమా రాఘవేంద్రే అన్నింటికి కారణమని తేలడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాఘవ అజ్ఞాతంలోనే వున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout