చంద్రబాబుకు రెండోసారి వంశీ లేఖ.. ఏం రాశారంటే...!
Send us your feedback to audioarticles@vaarta.com
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆపార్టీ సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ పంపారు. అందుకు చంద్రబాబు కూడా రియాక్ట్ అవుతూ ఓ లేఖ రాశారు. ఈ లేఖ అందిన అనంతరం తిరిగి చంద్రబాబుకు రెండోసారి వంశీ లేఖ రాశారు. ఈ లేఖలో పలు ఆసక్తికర విషయాలను వంశీ వెల్లడించారు. ఈ సందర్భంగా తాను రాసిన లేఖపై స్పందించినందుకుగానూ చంద్రబాబుకు వల్లభనేని కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీలో తన సేవల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
మన్నిస్తారని ఆశిస్తున్నా..!
‘నా ఆవేదనను అర్థం చేసుకొని లేఖ రాసినందుకు కృతజ్ఞతలు.
ఎలాంటి దాపరికాలు లేకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మీ(చంద్రబాబు) ముందుంచాను.
పార్టీ ప్రయోజనాల దృష్ట్యా 2006 నుంచి మీరు చెప్పిన విధంగా, మీ మార్గదర్శకంలోనే నడిచాను.
మీ ఆదేశానుసారం తొలిసారి విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేశాను. కానీ, ఓడిపోయాను.
అలా ఐదేళ్ల విలువైన కాలం వృథా అయ్యిందని ఏనాడు బాధపడలేదు.
ఓ సీనియర్ నేతపై, ఐపీఎస్ అధికారిపై, ఇలా ఎన్నోసార్లు నా పోరాటం సాగింది.
అప్రజాస్వామిక విధానాలపై నా పోరాటం ఎప్పుడూ ఆపలేదు.
2019 ఎన్నికల్లో నన్ను ఆపేందుకు ప్రత్యర్థులు ఎలాంటి ఒత్తిడి తెచ్చారో మీకు తెలుసు.
విషయాన్ని ఇంకా పొడిగించి భిన్నాభిప్రాయాలకు తావివ్వడం నాకు ఇష్టం లేదు.
నాకు అండగా ఉంటానన్నందుకు కృతజ్ఞతలు.
తెలిసో తెలియకో ఎక్కడైనా నా పరిధిదాటి ప్రవర్తిస్తే మన్నిస్తారని ఆశిస్తున్నాను’ అని సోషల్ మీడియా వేదికగా వంశీ రెండోసారి చంద్రబాబుకు లేఖ రాశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout