Kadiyam Srihari:ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. కడియంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
వెళ్లాలని భావిస్తున్న మాజీ మంత్రి కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి ఓ చీడ పురుగు అని మండిపడ్డారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్‌భాస్కర్, సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించారని గుర్తు చేశారు. బీసీలు, దళితులను రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
కడియం శ్రీహరి కోసం బీఆర్‌ఎస్ చాలా మంది నాయకులను కోల్పోయిందని విమర్శించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ను కడియంకు కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. కడియం శ్రీహరికి ప్రజాబలం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలని డిమాండ్ చేశారు. కడియం ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తలను అణచివేశారని.. ఆయన ఎంతో మందిని బలిపశువులను చేశారని విమర్శించారు. పదేండ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా కడియం ఖాళీగా లేరని.. ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీ, ఎంపీగా అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు.
శనివారం స్టేషన్ ఘన్‌పూర్‌లో మీటింగ్ పెడుతున్నామని.. మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందన్నారు. స్థానిక ప్రజలందరూ కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టంచేశారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడే అన్ని మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలిచామన్నారు. గులాబీ కోటలో చీడ పురుగుల్లా వచ్చి.. కోటను నాశనం చేసేందుకు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని ఫైర్ అయ్యారు. 2013లో టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారని.. ఇప్పుడు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాగా కడియం శ్రీహరి కుమార్తె కావ్యను వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఏకంగా కేసీఆర్‌కు లేఖ రాయడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తండ్రి, కుమార్తెలు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని కడియం ఇంటికి కాంగ్రెస్ సీనియర్ నేతలు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. దీంతో త్వరలోనే హస్తం కండువా కప్పుకోనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com