నారా లోకేష్‌ను ప్రమాదం నుంచి కాపాడిన ఎమ్మెల్యే..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారు. కాగా.. నేడు ఆయన ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి సమీపంలో ఉన్న ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపు చేశారు. దీంతో లోకేష్ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్ నుంచి దింపేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకుంది.
కాగా ఘటనకు ముందు నారా లోకేష్.. ఆకివీడు ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద వరదల వలన పాడైన చేపలను లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ దొంగలు తనను తిరగనీయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటిస్తే తాము తిరిగేవాళ్లం కామని ఆయన స్పష్టం చేశారు. కొల్లేరుకు ఎన్నడూ లేని రీతిలో వరదలు వచ్చాయని.. కానీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది లేదని నారా లోకేష్ విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో గత పదిరోజులుగా భారీ వర్షాలకు ఏపీలోని లోతట్టు ప్రాంతాలన్నీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు పంటపొలాలు నీట మునిగి రైతన్నలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు, పంటలు మునిగిన రైతన్నలను పరామర్శించాలని నారా లోకేష్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఇప్పటికే తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments