కవిత కోసం ఎమ్మెల్యే త్యాగం.. రాజీనామా చేసేందుకు రెడీ!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. నిజామాబాద్ నుంచి పోటీచేసిన కవితపై బీజేపీ తరఫున పోటీచేసిన అరవింద్ భారీ మెజార్టీతో విజయ డంఖా మోగించారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిజామాబాద్‌లో కమలం దెబ్బకు గులాబీ వాడిపోయింది!. ఈ నేపథ్యంలో కవిత పరిస్థితేంటి..? ఎమ్మెల్సీ పదవి ఇస్తారా..? ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారా..? ఇలా అనేక రకాలుగా వార్తలు వినవచ్చాయి.
ఈ నేపథ్యంలో కవితకు ఎమ్మెల్సీ అక్కర్లేదని.. ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఇందుకు జగిత్యాల నుంచి గెలిచిన తాను రాజీనామా చేస్తానంటూ సంజయ్ కుమార్ ముందుకొచ్చారు. జగిత్యాల నుంచి కవిత పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు. ఇక.. కవిత పోటీ చేసే విషయంలో హైకమాండ్‌దే తుది నిర్ణయమని తాను మాత్రం రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని ఆయన తేల్చిచెప్పారు.
కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీచేసి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీచేసి గెలిచిన విషయం విదితమే. అందుకే హుజర్ నగర్‌కు ఉత్తమ్ రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో అక్కడ్నుంచి టీఆర్ఎస్ తరఫున కవితను పోటీ చేయించాలని కొందరు నేతలు అనుకుంటున్న నేపథ్యంలో సంజయ్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్యే ప్రకటనపై టీఆర్ఎస్ అధిష్టానం.. ముఖ్యంగా మాజీ ఎంపీ కవిత, కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout