జగన్‌ పై నమ్మకం లేక ఎమ్మెల్యే రాజీనామా..

  • IndiaGlitz, [Friday,March 01 2019]

ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో.. పార్టీ నుంచి కీలకనేతలు, ఎమ్మెల్యేలు వీడుతుండటంతో షాక్ తగిలినట్లైంది. కర్నూలు జిల్లాలో కీలకనేత, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో పాణ్యం ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని గౌరు కుటుంబానికి జగన్‌ తేల్చిచెప్పడంతో వాళ్లు మాత్రం ఎమ్మెల్యే టికెట్టే కావాలని పట్టుబట్టారు. దీంతో జగన్ లండన్‌ పర్యటన వెళ్లక మునుపు నుంచి ‌గౌరు చరిత రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అప్పట్నుంచి వైసీపీ ముఖ్యనేతలు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. శుక్రవారం సాయంత్రం గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి వైసీపీకి రాజీనామా చేసేశారు.

జగన్‌పై నమ్మకం లేక..!

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నాకు పాణ్యం ఎమ్మెల్యే టికెట్ అడిగాం. పాణ్యం టికెట్ మాకే ఇవ్వాలని పదే పదే జగన్‌ను ఆడిగాం. మొదట ఇస్తామన్నారు.. ఇప్పుడు లేదంటున్నారు. వైఎస్‌ ఇచ్చే భరోసా జగన్‌లో కన్పించడం లేదు. గతంలో ముస్లింలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్‌ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ ఇస్తానంటే ఎలా నమ్మాలి?. ఈనెల 9న టీడీపీలో చేరుతున్నాం అని గౌరు చరిత దంపతులు మీడియాకు వివరించారు.

టీడీపీలో టికెట్ ఇవ్వకపోతే..

జగన్ నాకు అన్యాయం చేయరని అనుకున్నాము.. కానీ ఆయన మా నమ్మకం వమ్ము చేశారు. వైసీపీకి నేనెప్పుడూ నష్టం కలిగించలేదు. మాకు టీడీపీ నుంచి ఆహ్వానం ఉంది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో మాట్లాడాము. రెండో తేదీన సీఎం చంద్రబాబుతో మాట్లాడతాం. 9వ తేదీన టీడీపీలో చేరుతున్నాం. ఒకవేళ టీడీపీలో టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా సరే గౌరు చరితారెడ్డి పోటీ చేస్తారు అని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

More News

విజేతగా స్వదేశానికి వచ్చిన అభినందన్

పాక్ ఆర్మీ బందీగా పట్టుబడిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విజేతగా స్వదేశానికి వచ్చేశారు. వాఘా సరిహద్దు వద్ద పౌరులు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

ఎన్నికలు లేకుండానే ఏపీలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు-2019కు ముందు జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.

ఎన్టీఆర్ మామ నార్నె పోటీ ఇక్కడ్నుంచే..!?

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా..? ప్రకాశం జిల్లా అద్దంకి అసెంబ్లీ టికెట్ ఆయనకు ఫిక్స్ అయ్యిందా..? గుంటూరు ఎంపీ టికెట్

శ్రద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో - 2 విడుదల

ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సాహో. ఈ భారీ యాక్షన్ విజువల్ ఎంటర్టైనర్లో బాహుబలి ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

'షార్ట్ టెంప‌ర్' చిత్రం ప్రారంభం

ప్ర‌వీణా క్రియేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ పై రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.ఆర్‌.ఆర్‌. నిర్మిస్తున్న చిత్రం షార్ట్ టెంప‌ర్‌.