సడెన్‌గా హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యే రాజాసింగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సడెన్‌గా హాట్ టాపిక్‌గా మారారు. కారణం ఏంటంటే ఆయనకు ముప్పు పొంచి ఉందట. ఇది ఎవరో చెప్పిన మాట కాదు.. స్వయంగా నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో తెలంగాణకు చెందిన అధికారులు అప్రమత్తమయ్యారు. బుల్లెట్ ప్రూఫ్ కారులో మాత్రమే తిరగాలని రాజాసింగ్‌కు సూచనలు చేశారు. అంతేకాదు.. ఆయనకు హడావుడిగా భద్రతను పెంచేశారు.
రాజాసింగ్‌కు ప్రభుత్వం భద్రను పెంచింది. ఆయనకు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. ఇక మీదట ద్విచక్ర వాహనంపై తిరగవద్దంటూ సూచనలు జారీ చేసింది. ప్రభుత్వ బుల్లెట్ ప్రూఫ్ కారులో మాత్రమే వెళ్లాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సీపీ అంజనీ కుమార్ సూచించారు. అంతేకాదు.. ఈ భద్రను పర్యవేక్షించేందుకు గాను.. డీసీపీ స్థాయి అధికారిని నియమించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్కువగా ద్విచక్ర వాహనాన్ని మాత్రమే వినియోగిస్తున్నారు. కానీ ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా దానిని పక్కకు పెట్టాలని అధికారులు సూచించారు. సడెన్‌గా తనకు భద్రతను పెంచడం.. ముప్పు ఉందనడం తదితర విషయాలపై రాజాసింగ్ స్పందించారు. తనకు ఎవరి నుంచి ప్రాణహాని ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాను కేంద్ర, రాష్ట్ర హోంశాఖ మంత్రులకు లేఖ రాస్తానని రాజాసింగ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments