నాడు ఎమ్మెల్యే అయిన హీరో నేడు సి.ఎం..!

  • IndiaGlitz, [Thursday,November 24 2016]

నాడు ఎమ్మెల్యే అయిన హీరో నేడు సి.ఎం అనగానే....నిజంగానే అనుకుంటే పొర‌పాటే. రియ‌ల్ లైఫ్ లో కాదండీ.. రీల్ లైఫ్ లో అవుతున్నాడు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రు అనుకుంటున్నారా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు..! శ్రీను వైట్ల తెర‌కెక్కించిన దూకుడు చిత్రంలో మ‌హేష్ బాబు కొంచెం సేపు ఎమ్మెల్యేగా క‌నిపిస్తారు. ఇక ఇప్పుడు సి.ఎం గా కనిపించ‌బోతున్నార‌ట మ‌హేష్. బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ మ‌హేష్ బాబుతో ఓ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌నున్నారు.
ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్ ఊహించ‌ని విధంగా సి.ఎం అవుతాడ‌ట‌. అయితే...ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చే ప‌రిస్థితి ఉండ‌ద‌ట‌. అలాంటి స‌మ‌యంలో మ‌హేష్ ఏం చేసాడు..? అనేది చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుందని స‌మాచారం.ఏది ఏమైనా...నాడు ఎమ్మెల్యే గా న‌టించిన మ‌హేష్ నేడు సి.ఎంగా న‌టిస్తుండ‌డం విశేషం.