టీడీపీకి ఎమ్మెల్యే గుడ్ బై.. పక్కా ప్లాన్‌తోనేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ అనిపించుకుండే ఒక్క నేతా లేకపోవడం.. ఏపీలోనూ టీడీపీ ఖాళీ అవుతుండటంతో ఉన్న నేతలను అయినా పార్టీని వీడకుండా ఉండేందుకు బాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవన్నీ విఫలం అవుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి ఒక్కొకరుగా గుడ్ బై చెబుతూ వస్తున్న విషయం విదితమే. ఇప్పటికే వల్లభనేని వంశీ పార్టీకి టాటా చెప్పేయగా.. ఈ షాక్ నుంచి కోలుకోకమునుపే మరో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పార్టీకి గుడ్ బై చెప్పేయడం గమనార్హం. ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్త చంద్రబాబును, పార్టీ నేతలను కలవరపెడుతోంది.
జగన్‌ను కలిసిన తర్వాతే..!
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తన మిత్రులు, కుటుంబీకులు, ప్రధాన అనుచరులతో సమావేశమై తన నిర్ణయాన్ని వెల్లడించిన ఆయన నేరుగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో చర్చించి సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని గిరి ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి ఇప్పుడు మూడు రాజధానులు ఉంటాయన్న జగన్ ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన టీడీపీకి టాటా చెప్పాలనుకోవడం.. అది కూడా రాజధాని జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కావడం పెను సంచలనానికి దారితీస్తోంది.
పక్కా ప్లాన్‌తోనేనా!?
అయితే.. టీడీపీ ఎమ్మెల్యే గిరి వైసీపీలో చేరాలనుకోవడం వెనుక పక్కా ప్లాన్ ఉందని తెలుస్తోంది. రాజధానిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా నాటి మంత్రులు, ముఖ్యులు చాలా మంది వేల ఎకరాల్లో భూములు కొన్నారు. అయితే ఈ భూ దందాలో గిరి కూడా ఉన్నారని ఆయన తప్పించుకోవడానికి చేరుతున్నారని వాదన వినిపిస్తోంది. మరోవైపు అసలు వైసీపీలో ఏమేం జరుగుతోందో తెలుసుకోవడానికే అధిష్టానం ఆయన్ను అధికార పార్టీలోకి పంపిస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అనుమానాల్లో ఏది నిజమో..? ఏది అబద్ధమో తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే.. వైసీపీ గేట్లెత్తయడంతో వలసలు షురూ అయ్యాయన్న మాట. మరి మద్దాలి తర్వాత ఎంత మంది క్యూ కడతారో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout