'అజ్ఞాతవాసి' తో 'ఎం.ఎల్.ఎ.' వస్తున్నాడు
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 25వ చిత్రం అజ్ఞాతవాసి`. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్ షో 9వ తేదీనే ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉంటే...ఈ సినిమా విరామ సమయంలో నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ఎం.ఎల్.ఎ.` సినిమా ట్రైలర్ ని కూడా ప్రదర్శించనున్నారు.
“మంచి లక్షణాలున్న అబ్బాయి” అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్ కాగా...కల్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ నాయికగా నటించింది. ఉపేంద్ర మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమాకి మణిశర్మ స్వరాలను అందించారు. కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. గతంలో వీరు నేనే రాజు నేనే మంత్రి` సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments