పవన్‌కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటన సవాళ్లు ప్రతిసవాళ్లకు వేదికగా మారుతోంది. స్థానిక సమస్యల గురించి వెంగయ్య.. ఎమ్మెల్యే అన్నా రాంబాబును ప్రశ్నించిన సమయంలో ఆయన దుర్భాషలాడారని.. ఆ కారణంగానే వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అలాగే అన్నా రాంబాబు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జనసేన కార్యకర్తలు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన నేడు ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్‌ను కలిశారు. ప్రజల కోసం అభివృద్ధి గురించి అడిగిన యువకుడు ఆత్మహత్యకు కారకులైనవారిని తక్షణమే అరెస్టు చేయాలని పవన్ కోరారు. వెంగయ్య భార్య కేశవ నారాయణమ్మ, బిడ్డలు, సోదరుడితో కలిసి ఒంగోలులో జిల్లా ఎస్పీ కార్యాలయానికి పవన్ వెళ్లారు. ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను వివరించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు దుర్భాషలాడటం, అధికార పార్టీ నేతల బెదిరింపుల గురించి వెల్లడించారు. వెంగయ్య కుటుంబ సభ్యులు సైతం తమకు ఎదురైన ఒత్తిళ్లను, కలిగిన క్షోభను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు వివరించారు.
అయితే పవన్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నా రాంబాబు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పవన్‌కు ఓ సవాల్ విసిరారు. అసత్య ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్‌కు ఓ సవాల్ చేస్తున్నానని అన్నా రాంబాబు పేర్కొన్నారు. బహిరంగ సభ నిర్వహించి అదే సభలో తాను రాజీనామా చేస్తానని.. తిరిగి ఇద్దరం కలిసి పోటీ చేద్దామన్నారు. పవన్ గెలిస్తే తాను ఎలాంటి శిక్ష అనుభవించటానికైనా సిద్ధంగా ఉన్నానని.. ఒకవేళ పవన్ ఓడిపోతే పార్టీ రద్దుకు సిద్ధమా? అని అన్నా రాంబాబు సవాల్ విసిరారు. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments