Tamil »
Cinema News »
'యమన్' చిత్రం సక్సెస్ అయి తెలుగులో నాకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెస్తుంది - మియాజార్జ్
'యమన్' చిత్రం సక్సెస్ అయి తెలుగులో నాకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెస్తుంది - మియాజార్జ్
Wednesday, February 22, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అందం, అభినయం ఉన్న నటి మియాజార్జ్. మలయాళం, తమిళ భాషల్లో 20 చిత్రాలకు పైగా హీరోయిన్గా నటించి అనతి కాలంలోనే మంచి పర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్న మియాజార్జ్ ప్రస్తుతం సునీల్ సరసన 'ఉంగరాల రాంబాబు' చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా విజయ్ ఆంటోని హీరోగా జీవశంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి రూపొందిస్తున్న 'యమన్' చిత్రంలో మియాజార్జ్ హీరోయిన్గా నటించింది. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై చిట్యాల సాయికుమార్‌రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతోంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ ధ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోని డ్యూయల్ రోల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఆడియోకి, ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం రిలీజ్ సందర్భంగా హీరోయిన్ మియాజార్జ్తో ఇంటర్వ్యూ.
మీ బ్యాగ్రౌండ్ గురించి?
కేరళలోని కొట్టాయం సమీపంలో పాల స్వగ్రామం మాది. మలయాళ, తమిళ భాషల్లో 20 చిత్రాల్లో నటించాను.
'యమన్' చిత్రంలో నటించే ఛాన్స్ ఎలా వచ్చింది?
ఆల్రెడీ జీవశంకర్ గారి డైరెక్షన్లో ఒక మూవీ చేశాను. విజయ్ ఆంటోనిగారితో జీవశంకర్ ఫస్ట్ మూవీ చేశారు. ఇప్పుడు విజయ్ ఆంటోనిగారితో, నాతో మా ఇద్దరి కాంబినేషన్లో జీవశంకర్ రెండో చిత్రం చేయడం చాలా ధ్రిల్లింగ్‌గా ఉంది.
ఈ చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చేశాను. నా క్యారెక్టర్ పేరు అంజన. సినిమాల్లో నటిస్తూ సాధారణ జీవితం గడిపే అమ్మాయి. వెరీ టిపికల్ గర్ల్.
ఈ చిత్రం ఎలా ఉంటుంది?
ఇట్స్ ఎ పొలిటికల్ ధ్రిల్లర్ మూవీ. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఇదివరకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ వాటన్నింటికంటే ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందరికీ పనిష్మెంట్ ఇచ్చే ఎలిమెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సీన్ తర్వాత నెక్ట్స్ సీన్ ఏం వస్తుంది అనే క్యూరియాసిటీ ఆడియన్లో కలుగుతుంది. అంత ఇంట్రెస్టింగ్గా ఈ చిత్రం ఉంటుంది.
విజయ్ ఆంటోనితో నటించడం ఎలా ఉంది?
వెరీ నైస్ పర్సన్ విజయ్ ఆంటోని. మ్యూజిక్ డైరెక్టర్, సౌండ్ ఇంజనీర్, హీరో. హి ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్. మంచి కథలు ఎంపిక చేసుకుంటూ హీరోగా వరుస సక్సెస్‌లు సాధిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.
నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మేకింగ్ గురించి?
పర్ఫెక్ట్ ప్లానింగ్ వున్న నిర్మాత రవీందర్‌రెడ్డిగారు. సినిమాకి ఏం కావాలో, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో తెలిసిన వ్యక్తి. మంచి ఫ్యూచర్ ఉన్న నిర్మాత. ఆయన బ్యానర్లో ఈ చిత్రం చేయడం లక్కీగా భావిస్తున్నాను. 'యమన్' చిత్రాన్ని ఎక్స్‌లెంట్‌గా ప్రమోట్ చేస్తున్నారు. డెఫినెట్‌గా ఈ చిత్రం మంచి సక్సెస్ అయి హీరోయిన్గా నాకు మంచి పేరు తెస్తుంది.
తెలుగులో కంటిన్యూగా సినిమాలు చేస్తారా?
డెఫినెట్‌గా చేస్తాను. అంతకు ముందు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కొంచెం భయపడ్డాను. ఇప్పుడు కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటున్నాను. రెగ్యులర్‌గా అన్ని భాషల్లో సినిమాలు చేసి నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది.
'ఉంగరాల రాంబాబు' చిత్రం ఎలా ఉండబోతుంది?
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సెంటిమెంట్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి.
మీకు బాగా నచ్చిన హీరో, హీరోయిన్ ఎవరు?
అందరు హీరోలని లైక్ చేస్తాను. ఒక్కొక్క హీరోలో ఒక్కో ఎలిమెంట్ ఉంటుంది. వారు చేసే క్యారెక్టర్లో లీనమై నటించి ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతారు. నా ఫేవరెట్ హీరో ఒక్కరని చెప్పలేను. హీరోయిన్గా నిత్యమీనన్ అంటే నాకు చాలా ఇష్టం.
ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు?
పర్ఫామెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్‌లో నటించాలని అనుకుంటున్నాను. రెగ్యులర్ హీరోయిన్లా కాకుండా నాకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి.
మీరు ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తారు?
బేసికల్‌గా నేను క్లాసికల్ డాన్సర్‌ని. వెస్ట్రన్ డాన్స్ కూడా వచ్చు. తమిళంలో షరీఫ్ మాస్టర్ వద్ద కోచింగ్ తీసుకున్నాను. ఈ చిత్రంలో నేను సోలో సాంగ్‌లో నటించాను. నా ఫోర్ ఇయర్స్ కెరీర్లో ఫస్ట్‌టైం సోలో సాంగ్ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. క్రైం, ఎమోషనల్ సీన్స్‌లో కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇష్టం. కానీ డాన్స్ చేయడం చాలా కష్టం. రెండూ బాలెన్స్ చేస్తూ ఈ చిత్రంలో నటించాను.
నెక్ట్స్ మూవీస్ ఏంటి?
డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments