'మిఠాయి' ప్రారంభం
- IndiaGlitz, [Sunday,January 14 2018]
డార్క్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న కొత్త చిత్రం 'మిఠాయి'. రెడ్ యాంట్స్ బ్యానర్‌పై ప్రశాంత్ కుమార్ దర్శక నిర్మాణంలో సినిమా తెరకెక్కనుంది. ఆదివారం ఈ సినిమా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా, క్రాంతిమాధవ్‌లు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయ్ దేవరకొండ క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా....
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ - ''ఈ సినిమా ద్వారా దర్శక నిర్మాతగా పరిచయమవుతున్న ప్రశాంత్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుంటే..రాహుల్ రామకృష్ణ, కమల్ కామరాజు, ప్రియదర్శి, శ్వేత, గాయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిఫరెంట్ కథ. తెలుగులో డార్క్ కామెడీ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్'' అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ''ఈ సినిమాకు పనిచేస్తున్న యూనిట్‌లో అందరూ నాకు పెళ్ళిచూపులు నుండి పరిచయమే. ముఖ్యంగా ప్రశాంత్ నాకు మంచి ఫ్రెండ్. డార్క్ కామెడీ సినిమా అనగానే చాలా క్యూరియస్‌గా వెయిట్ చేస్తున్నాను. ఎంటైర్ టీంకు అభినందనలు'' అన్నారు.
రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ - ''మంచి కథ. కచ్చితంగా ప్రేక్షకులను ఎంటైర్ చేసేలా డార్క్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుంది'' అన్నారు.
వివేక్ సాగర్ మాట్లాడుతూ - ''అందరికీ నచ్చే సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
శ్వేతా వర్మ మాట్లాడుతూ - ''సంక్రాంతి కానుకగా సినిమాను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంత్‌కుమార్‌గారికి థాంక్స్'' అన్నారు.
గాయత్రి గుప్తా మాట్లాడుతూ - ''సినిమా అంటే ప్యాసన్, పిచ్చి ఉన్న వ్యక్తులు కలిసి చేస్తున్న సినిమా ఇది. విలక్షణమైన కథ. అవకాశం ఇచ్చిన ప్రశాంత్‌గారికి థాంక్స్'' అన్నారు.
దర్శకుడు ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ - ''డార్క్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఇక్కడ తక్కువ సినిమాలే వచ్చాయి. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. మంచి టీంతో చేస్తున్న సినిమా'' అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రియదర్శి, భూషణ్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
గాయత్రి గుప్తా, శ్వేతా వర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, భూషణ్ కల్యాణ్, కమల్ కామరాజు, రవివర్మ, అజయ్‌ఘోష్, విజయ్ మురార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీ: సాకేత్ సౌరభ్, ఎడిటింగ్ : వీణు భూషణ్, కొరియోగ్రఫీ: అనీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కృష్ణ వొడపల్లి, నిర్మాత, దర్శకత్వం : ప‌్రశాంత్ కుమార్.