హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా 'మిస్టర్ యోగి' ఫస్ట్ లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
జవాన్ అండ్ కాస్పియన్ ఇంటర్నేషనల్ పతాకంపై అజయ్ హీరోగా సుధాకర్ వినుకొండ దర్శకత్వంలో జె.వై. రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'మిస్టర్ యోగి'. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని హీరో నవీన్‌చంద్ర హైద్రాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అజయ్, చిత్ర దర్శకుడు సుధాకర్ వినుకొండ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సుధాకర్ రావు కులకర్ణి, కిరణ్ సిరిగిరి; రైటర్ టైమ్ నాని, శాలిని తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుధాకర్ వినుకొండ మాట్లాడుతూ...' మా చిత్ర పోస్టర్‌ని విడుదల చేసిన హీరో నవీన్‌చంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇదొక వెరైటీ స్టోరీ. మా హీరో అజయ్ ఈ సబ్జెక్ట్‌కు, టైటిల్‌కు కరెక్ట్‌గా యాప్ట్ అయ్యాడు. మ్యూజికల్‌గా కూడా అద్భుతంగా ఉంటుంది. నిర్మాత జె.వై రెడ్డిగారి ప్రోత్సాహంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాము. ఈ నెల 24 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
అజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కిరణ్ శంకర్, కెమెరా: దులీప్ కుమార్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సుధాకర్ రావు కులకర్ణి, కిరణ్ సిరిగిరి; ప్రొడ్యూసర్: జె.వై. రెడ్డి. కథ-దర్శకత్వం: సుధాకర్ వినుకొండ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments