హైదరాబాద్‌లో బస్సు మిస్సింగ్.. నాందేడ్‌లో పార్ట్స్ లేకుండా ప్రత్యక్షం!
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్ మిస్సింగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. నగరంలోని ఆఫ్జల్ గంజ్ వద్ద అపహరణకు గురైన టీఎస్ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని నాందేడ్ వద్ద ప్రత్యక్షమైంది. నాందేడ్ సమీపంలోని ఓ ప్రముఖ ఆటోమొబైల్ ఏరియా కంకిడిలో బస్సు ఏ పార్టుకు ఆ పార్టు విడిపోయి ఉన్న స్థితిలో పోలీసుల కంటపడటం గమనార్హం. కాగా.. అక్కడ ఓ షెడ్డులో బస్ కిందిభాగం మాత్రమే మిగిలి ఉండటాన్ని చూసిన పోలీసులు ఒకింత కంగుతిన్నారు. అయితే బస్సులో కీలకమైన విడిభాగాలను మాత్రం అదృశ్యమయ్యాయి.
బస్సు కింది భాగంలోని పార్ట్ తప్ప ఏమీ లేవు. అయితే బస్సు అయితే ఎలాంటి పార్ట్స్లేకుండా దొరికింది కానీ.. ఆ బస్సును దొంగలించిన వారి అడ్రస్ మాత్రం దొరకలేదు. దీంతో పోలీసులు ఆ దుండగుల కోసం గాలిస్తున్నారు. అయితే ఆ బస్సును దొంగలించింది మాజీ ఉద్యోగులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. బస్సును దొంగలించిన వారిలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పోలీసుల రాకతో మరో ముగ్గురు పారిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసుల ప్రస్తుతం రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.
బస్సు ఎలా మిస్ అయ్యింది..!?
మంగళవారం రాత్రి కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును డ్రైవర్ ఆఫ్జల్‌గంజ్ బస్ స్టాప్ వద్ద నిలిపాడు. అయితే బుధవారం ఉదయం యథావిథిగా డ్రైవర్ డ్యూటీ వచ్చాడు. బస్సు నిలిపిన స్థలంలోకి వెళ్లగా అక్కడ కనపడకపోవడం కంగారుపడ్డ డ్రైవర్ డీఎంకు సమాచారం అందించారు. దీంతో బస్సు చోరీకి గురైనట్టు గుర్తించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బస్సు తూఫ్రాన్ టోల్ గేట్ దాటి వెళ్లినట్టు గుర్తించి.. ఆ దిశగా గాలింపు చేపట్టారు. చివరికి నాందేడ్ వైపు వెళ్లినట్టు తేలడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు.
ఇదీ అసలు కారణం..!
గత ఏడాది భారీ వర్షాలతో గౌలిగూడ బస్ డిపో కుప్పకూలింది. కాగా.. షెడ్డు ఉన్న సమయంలో భద్రతా సిబ్బంది బస్సులకు కాపలా ఉండేవారు. అయితే ఇప్పుడు బహిరంగంగా బస్సులను నిలుపుతున్నారు. దీంతో బస్సులకు సెక్యూరిటీ లేకుండా పోయింది. ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతోనే బస్ మిస్ అయ్యిందని.. ఆర్టీసీ ఎంత నిర్లక్ష్యం వహించిందో ఈ ఘటనతో అర్థం చేసుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments