షూటింగ్ లొకేషన్ లో యూనిట్ మధ్య బర్త్ డే కేక్ కటింగ్ మిస్ అవుతున్న - నిధి అగర్వాల్

  • IndiaGlitz, [Sunday,August 16 2020]

మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు చాలా దగ్గర అయిపోయింది హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నిధి ఈ ఏడాది తన పుట్టినరోజును(ఆగష్టు17) బెంగళూరులో తన నివాసంలోనే కుటుంబ సభ్యులు మధ్య జరుపుకుంటున్నారు. సినీ కెర్రిర్ స్టార్ట్ చేసాక తన పుట్టినరోజు సెట్స్ లోనే జరిగేదని, యూనిట్ సభ్యులు మధ్య కేక్ కటింగ్ సెలెబ్రేషన్స్ జరిగేవని, ప్రస్తుతం కరోనా కారణంగా తాను యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్స్ ప్రస్తుతం ఆగిపోవడం కారణంగా ఈ ఏడాది ఇంట్లో కుటుంబంతోనే పుట్టినరోజు జరుపుకుంటున్నట్లుగా నిధి తెలిపారు.

ప్రస్తుతం నిధి, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ లాంఛింగ్ మూవీలో నటిస్తున్నారు, అలానే తమిళ్ లో భూమి అనే చిత్రం చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని కొత్త కథలు వింటున్నారు. ఇక తాజాగా ఫేస్ బుక్ లో సరోకొత్త రికార్డు సెట్ చేశారు నిధి. ఈ జనరేషన్ యంగ్ హీరోయిన్స్ లో అత్యధికంగా 8.5 మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ తో నిధి మొదటి స్థానంలో ఉన్నారు.

More News

అదే నాకో పెద్ద ఛాలెంజ్: ‘బిగ్‌బాస్ 4’పై నాగార్జున

తెలుగు టెలివిజన్‌లో అత్యుత్తమమైన రేటింగ్స్‌ని సాధించి, వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతిపెద్ద నాన్ ఫిక్షన్ షో ‘బిగ్‌బాస్ 4’

హెలికాఫ్టర్ షాట్ మాదిరిగానే రిటైర్మెంట్ షాక్‌.. ధోనీ వెంటే రైనా..

మహేందర్ సింగ్ ధోని.. భారత క్రికెట్ దిగ్గజం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. అద్భుతమైన కెప్టెన్.. కూల్ కెప్టెన్..

ఆకట్టుకుంటున్న విశాల్ ‘చక్ర’ ట్రైల‌ర్ ఒరిజిన‌ల్ సౌండ్ ట్రాక్‌..

హీరో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్న సినిమా ‘చక్ర’. ఈ చిత్ర ట్రైలర్‌కు సంబంధించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

పాన్‌–ఇండియా ఫిల్మ్‌ ‘మ్యాడి (అనే) మాధవ్‌’ ఫస్ట్‌లుక్‌, ఇండిపెండెన్స్‌ డే స్పెషల్‌ సాంగ్‌ విడుదల

తెలుగు సహా తమిళం, మలమాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆన్మే క్రియేషన్స్‌ పతాకంపై అనిల్‌కుమార్‌ నిర్మిస్తున్న పాన్‌–ఇండియా ఫిల్మ్‌ ‘మ్యాడి (అనే) మాధవ్‌’.

ఫైర్ యాక్సిడెంట్‌పై జ‌గ‌న్‌కు రామ్ ట్వీట్‌!!

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ సినిమాల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరంగా ఉంటారు.