నాగ్ ఊపిరి మిస్ అయ్యింది.. అందుకే అంటున్న ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ కలసి నటిస్తున్న చిత్రం ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు.తెలుగు, తమిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా..అందాల తార అనుష్క గెస్ట్ రోల్ చేస్తుంది. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఊపిరి సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే...అసలు ఈ చిత్రంలో నాగ్ తో కలసి ఎన్టీఆర్ నటించాలి. కథ విని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇంకేముంది..అక్కినేని, నందమూరి వారసుల కలయికలో అసలైన మల్టీస్టారర్ వస్తుందనుకున్నారు. కానీ..కాలం కలసి రాలేదు. కాంబినేషన్ సెట్ కాలేదు. ఇదే విషయం గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అడిగితే...ఊపిరి సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది. కథ విన్న వెంటనే ఈ సినిమా చేయడానికి ఓకె చెప్పాను. అయితే డేట్స్ ఎడ్జెస్ట్ చేయడం కుదరలేదు. అందుకనే ఊపిరి మిస్ అయ్యాను అన్నారు ఎన్టీఆర్. మరి...ఇప్పుడు మిస్ అయిన అక్కినేని, నందమూరి వారసుల కాంబినేషన్ ఫ్యూచర్ లో సెట్ అవుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout