'2 స్టేట్స్' లో మిస్ విజయవాడ
Send us your feedback to audioarticles@vaarta.com
లక్ష్య ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం '2 స్టేట్స్'. చేతన్ భగత్ రాసిన నవల '2 స్టేట్స్' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడవిశేష్, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మిస్ విజయవాడ ప్రియా చౌదరి నటించనుంది. ఏప్రిల్ 5 నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. అందులో లిజి, ఆదిత్య మీనన్ సహా ప్రధాన పాత్రధారులు నటించనున్నారు.
రెండో షెడ్యూల్‌ను కోల్‌కతాలో చిత్రీకరిస్తారు. మూడో షెడ్యూల్‌ను యు.ఎస్‌లో చిత్రీకరిస్తారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ సినిమా ఆల్‌రెడీ మంచి విజయాన్ని సాధించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments