'మిస్ మ్యాచ్' తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన క్రిష్
Send us your feedback to audioarticles@vaarta.com
నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ 'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తమ తొలి చిత్రం గా 'మిస్ మ్యాచ్' పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు 'క్రిష్' విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు 'క్రిష్' మాట్లాడుతూ...' డైరెక్టర్ నిర్మల్ గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి. మంచి మిత్రుడు . ఆయన మేకింగ్ నాకు డా:సలీం(విజయ్ ఆంటోని) సినిమా తోనే అర్థమైంది . ఈ సినిమా అంతకన్నా ఎక్కువ హిట్ అవుతుందనే అనుకుంటున్నాను . దీనికి రచయిత భూపతి రాజు గారు, ఆయన గురించి మనందరికీ తెలిసిందే .ఆనాటి ముఠామేస్త్రి నుండి ఇప్పటి సైరా నర్సింహారెడ్డి వరకు ఆయన రాసిన సినిమా లు మనం చూస్తూనే ఉన్నాం.సినిమాటోగ్రాఫర్ గణేష్ గారు, నిర్మాత శ్రీ రామ్ మరియు భరత్ రామ్ గారు అందరు నాకు తెలిసిన వాళ్ళే. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా కథానాయకుడు ఉదయ్ శంకర్, కథానాయకి ఐశ్వర్య రాజేష్ . ఈయన మొదటి సినిమా ఆట గదరా శివ -చంద్ర సిద్ధార్థ్ గారి దర్శకత్వంలో రూపొందించబడింది, మంచి విలువలు కలిగిన చిత్రం.. ఈ సినిమా కి పని చేస్తున్న నటీ నటులు, సాంకేతిక నిపుణులు అందరికి శుభాకాంక్షలు అన్నారు.
మాటల రచయిత రాజేంద్రకుమార్ ' ఇది ఒక అచ్చమైన , స్వచ్చమైన ప్రేమ కథ. ఒక బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, కంచె లాంటి సినిమాల స్థాయి లో ఈ చిత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ సినిమా రష్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని. మీ అందరికి చాల బాగా నచ్చుతుంది. డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారు మనకు డా:సలీం సినిమా తోనే పరిచయం అయ్యారు. చాల మంచి దర్శకుడు. ఈ సినిమా ని మీరు అందరు ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర కధా రచయిత భూపతిరాజా మాట్లాడుతూ మా మాటని మన్నించి ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన దర్శకులు 'క్రిష్' గారికి కృతజ్ఞతలన్నారు.
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ...' మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత దూరం వచ్చి మా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసినందుకు క్రిష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే నచ్చి పక్కాగా చేద్దాం అని చెప్పాను. అనుకున్నట్టుగానే స్క్రిప్ట్ పరంగా సినిమా బాగా వస్తోంది..అన్నారు.
మరో మాటల రచయిత మధు మాట్లాడుతూ...' భూపతి రాజా గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. భూపతి రాజ గారు రాసే కథలు యూత్ ని ఆకర్షించే విధంగా ఉంటాయి.. కొత్త దనం ఉన్న కథ. దీనికి తోడు మంచి దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మంచి కాస్టింగ్ ఈ చిత్రానికి తోడయ్యింది అన్నారు.
చిత్ర నిర్మాతలలో ఒకరైన జి.శ్రీరామ్ రాజు మాట్లాడుతూ...'ఒక మంచి కథాబలం ఉన్న ఈ చిత్రం 'మిస్ మ్యాచ్' తో నిర్మాత అవుతున్నందుకు సంతోషంగ ఉందని అన్నారు.
మరో నిర్మాత భారత్ రామ్ మాట్లాడుతూ...'. ముందుగా ఒక మాట చెప్పాలి. మా అందరకి గురువు, మేము నమ్మే వ్యక్తి 'శ్రీరామ్ సార్ ఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాం.ఆయన అబ్బాయే మన హీరో ఉదయ్ శంకర్ ఈ సినిమా మంచి సక్సెస్ ఇస్తుందని భావిస్తున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు గిఫ్టన్ ఇలియాస్ మాట్లాడుతూ..'ఇంత మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమా కి నేను సాంగ్స్ కంపోజ్ చేయడం నిజంగా నా అద్రుష్టం . ఈ సినిమా వల్ల మంచి టీం దొరికింది. అందరకి నా శుభాకాంక్షలు.
ఛాయాగ్రాహకుడు గణేష్ చంద్ర మాట్లాడుతూ..' నా తొలి చిత్రానికి ఇంత మంచి టీమ్ దొరకటం సంతోషంగా ఉందని అన్నారు.
చిత్ర దర్శకుడు నిర్మల్ కుమార్ మాట్లాడుతూ...'క్రిష్ గారు నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా కు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతఙ్ఞతలు.నాకు ఇది తెలుగులో ఫస్ట్ మూవీ. దీనికి రచయిత సరస్వతి పుత్రుడు అయినటువంటి భూపతి రాజ గారు కధ నందించారు. సలీం చిత్రాన్ని ఎలా అయితే ఆదరించారో, ఈ 'మిస్ మ్యాచ్'ని కూడా అలానే ఆదరించి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .నిర్మాతలు: జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్
దర్శకత్వం: ఎన్ వి. నిర్మల్ కుమార్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout