Miss India Review
`మహానటి`తో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తిసురేశ్ తర్వాత వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలను సైన్ చేసింది. అందులో ముందుగా సైన్ చేసిన చిత్రమే ఈ `మిస్ ఇండియా`. వ్యాపారం చేసి తనేంటో ప్రూవ్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓ అమ్మాయి తన ప్రయాణంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొందనేది సినిమా కాన్సెప్ట్ అని ట్రైలర్ చూస్తే ఓ అవగాహన వస్తుంది. ఈ సినిమా కోసం కీర్తి బరువు కూడా తగ్గింది. ఓ కొత్త దర్శకుడిని నమ్మి కీర్తి `మిస్ ఇండియా` సినిమా ఎందుకు చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఓటీటీలో విడుదలైన కీర్తి సురేశ్ రెండో సినిమా `మిస్ ఇండియా` ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ముందు సినిమా కథేంటో చూద్దాం...
కథ:
మానస సంయుక్త(కీర్తిసురేశ్) వైజాగ్ దగ్గర ఓ మారుమూల ప్రాంతంలో ఉంటుంది. తండ్రి(వి.కె.నరేశ్) ఉద్యోగం చేస్తుంటాడు. మానసకి తాతయ్య(రాజేంద్ర ప్రసాద్) అంటే చాలా ఇష్టం. ఆయనొక ఆయుర్వేద డాక్టర్. చాలా రోగాలకు టీ వైద్యం చేస్తుంటాడు. తాతయ్య దగ్గర మానస వివిధ రకాలైన టీలు ఎలా పెట్టాలో నేర్చుకుంటుంది. మానసకు తండ్రి చిన్నప్పుడు ఓ గోల్ ఉండాలని చెప్పడంతో బిజినెస్ చేయాలని అనుకుంటుంది. కానీ అందరూ ఆమెకు ఆడపిల్లలు బిజినెస్ చేయకూడదని సలహాలు చెబుతుంటారు. అనుకోకుండా తండ్రికి అల్జీమర్స్ రావడం, తాతయ్య చనిపోవడంతో..కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. అదే సమయంలో అన్నయ్యకు అమెరికాలో బాజ్ రావడంతో అందరూ కుటుంబంతో సహా అమెరికా వెళ్లిపోతారు. అక్కడే మానస ఎంబీఏ చదివి ఉద్యోగం సంపాదిస్తుంది. కానీ ఆమెకు ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. వ్యాపారం చేయాలనుకుంటుంది. అదే సమయంలో ఆమె బాస్ విక్రమ్(నవీన్ చంద్ర) ఆమెను పెళ్లి చేసుకుంటానని అంటాడు. కానీ ఆమె అతన్ని తిరస్కరిస్తుంది. దాంతో ఇంట్లో వాళ్లకి కోపం వస్తుంది. దాంతో మానస ఇల్లు వదిలి వచ్చేస్తుంది. అమెరికాలో కాఫీ దొరకదు. అలాంటి చోట ఇండియన్ టీ అమ్మితే బావుంటుందని మానస భావిస్తుంది. అప్పుడామె ఏం చేసింది? ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? కైలాష్ శివకుమార్‌తో కీర్తిసురేశ్ ఎందుకు పోటీ పడుతుంది? చివరకు ఆమె బిజినెస్‌లో సక్సెస్ అయ్యిందా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇందులో ముందుగా సాంకేతిక వర్గాన్ని చూసుకుంటే ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ నరేంద్రనాథ్. అసలు కీర్తిసురేశ్‌ను ఏ పాయింట్ చెప్పి ఒప్పించాడా? అని సినిమా చూసిన సగటు ప్రేక్షకుడికి వచ్చే తొలి ప్రశ్న. సరే! ఆమె ఒప్పుకుందే అనుకుందా. అలాంటప్పుడు సినిమాను ఎలా ప్రెజెంట్ చేశాడనేది చాలా ముఖ్యం. స్త్రీ సాధికారితను బేస్ చేసుకుని నరేంద్ర నాథ్ రాసుకున్న ఈ పాయింట్ తెరపై చూస్తే మాత్రం చాలా వేక్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడా సినిమాను రక్తికట్టించే బలమైన ఎమోషన్స్ బలంగా లేవు.. ఎక్కడా ఆడియెన్స్‌కు కనెక్ట్ కావు. ప్రపంచమంతా గ్లోబలైజేషన్ అయిన నేటి రోజుల్లో అమెరికాకు వెళ్లి ఓ అమ్మాయి ఛాయ్ బిజినెస్ చేయడం అనే కాన్సెప్ట్ ఓల్డ్ కాన్సెప్ట్. సరే.. పాత కాన్సెప్టే అయినా దర్శకుడు సినిమాను ఎంత రసవత్తరంగా చెప్పాడనేది కూడా కీలకం. ఆ రకంగా చూస్తే నరేంద్ర పాత్రలను, సన్నివేశాలను మలిచిన తీరు ఎక్కడా గొప్పగా అనిపించదు. ఆడియెన్స్ ఎక్కడా కనెక్ట్ అయ్యే అవకాశమే లేదు. ఇక తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో కాస్త బాగున్న అంశం. అలాగే టైటిల్స్ వేసే క్రమంలో వచ్చే లచ్చ గుమ్మడి గుమ్మడిరా సాంగ్ కూడా బావుంది. సినిమాటోగ్రఫీ ఓకే. సినిమాను బోరింగ్‌గా అంతసేపు నడిపే బదులు మరో పదిహేను నిమిషాలు ఎడిట్ చేసుంటే బావుండుగా అనే భావన కూడా వస్తుంది. ఇక నటీనటులు పరంగా చూస్తే కీర్తిసురేశ్ గురించి, ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ అవార్డ్ విన్నర్, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, నదియా, సీనియర్ నరేశ్, కమల్ కామరాజు వీరందరూ నటనలో కొత్తగా రాలేదు. అద్భుతమైన నటుడు. వీళ్ల దగ్గర నుండి ఔట్ పుట్ రాబట్టుకోవడం దర్శకుడు చేతిలోనే ఉంటుంది. ఆ విషయం సినిమాలో స్పష్టంగా అర్థమైంది. సన్నివేశాలను, పాత్రలను మలిచడంలో దర్శకుడి ఫెయిల్యూర్ స్పష్టంగా కనపడుతుంది. సినిమా చూసిన తర్వాత ఈ సినిమాను తెరకెక్కించడానికి ఈ స్టార్ క్యాస్ట్ ఎందుకు కాస్త బడ్జెట్ తగ్గించుకుని ఉండుంటే బావుండుగా అనిపిస్తుంది. సినిమా ఫస్టాప్, సెకండాప్ ఎక్కడా సీన్ బావుందే అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు. నిజంగానే సినిమా చూస్తే టీ గొప్పతనం అర్థమయ్యిందిగా అనే పీలింగ్ కలిగింది.
బోటమ్ లైన్: మిస్ ఇండియా.. (తలనొప్పితో) టీ తప్పకుండా తాగ్సాలిందే
Read Miss India Movie Review in English
- Read in English