'యమన్' చిత్రం 'బిచ్చగాడు' కంటే పెద్ద హిట్ అవుతుంది - నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి

  • IndiaGlitz, [Saturday,February 11 2017]
విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవ శంకర్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్‌'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని, హీరోయిన్‌ మియా జార్జ్‌, నిర్మాత మిర్యాల రవిందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ - ''బిచ్చగాడు తర్వాత విజయ్‌ ఆంటోనిగారు హీరోగా నటించిన మరో మంచి చిత్రం 'యమన్‌'. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలోనూ ఇదో డిఫరెంట్‌ మూవీ అని చెప్పొచ్చు. కంప్లీట్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న సినిమా. ఇంతకుముందు సినిమాల్లో హీరోయిన్‌తో రొమాన్స్‌, సాంగ్స్‌ ఎక్కువగా లేవు. ఈ సినిమాలో మాత్రం రొమాన్స్‌, సాంగ్స్‌ వుంటాయి. రెగ్యులర్‌ కమర్షియల్‌ మూవీలా 'యమన్‌' వుంటుంది. గత సంవత్సరం బిచ్చగాడు రిలీజ్‌ అయిన టైమ్‌లోనే ఈ చిత్రాన్ని కూడా మహాశివరాత్రి కానుకగా రిలీజ్‌ చేస్తున్నాం. ఖచ్ఛితంగా ఈ సినిమా బిచ్చగాడు అంతటి విజయాన్ని సాధిస్తుంది. ఇప్పటివరకు విజయ్‌ ఆంటోని అంటే బిచ్చగాడు హీరోగానే అందరూ గుర్తించారు. ఈ సినిమా తర్వాత 'యమన్‌' హీరో అని కూడా పిలుస్తారు.
ఈరోజు సాంగ్స్‌ రిలీజ్‌ చేయడం జరిగింది. ఇందులో 5 పాటలు వున్నాయి. ఒక పాట హీరోయిన్‌పై, మరో పాట లుంగి డాన్స్‌ టైప్‌లో వుంటుంది. హీరో, హీరోయిన్‌పై ఒక సాంగ్‌ వుంటుంది. మరో రెండు పాటలు స్టోరీతో వెళ్ళే బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్స్‌. ఈ పాటల్ని ఆల్‌లైన్‌లో విడుదల చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాకి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చి పెద్ద హిట్‌ అవుతుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న మహాశివరాత్రి కానుకగా విడుదల చేస్తున్నాం'' అన్నారు.
హీరోయిన్‌ మియా జార్జ్‌ మాట్లాడుతూ - ''తెలుగులో ఇది నా మొదటి సినిమా. 'యమన్‌' స్ట్రాంగ్‌ స్క్రిప్ట్‌తో చేసిన సినిమా. మ్యూజిక్‌, హీరో, హీరోయిన్‌, ఫైట్స్‌... ఇవన్నీ సపోర్టింగ్‌గా వుంటాయి తప్ప సినిమాకి స్క్రిప్టే మెయిన్‌. ఈ సినిమా చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం తెలుగులో సునీల్‌తో క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. మరో పదిరోజులు షూటింగ్‌ వుంది. 'యమన్‌' తర్వాత తెలుగులో రిలీజ్‌ అయ్యే సినిమా అదే'' అన్నారు.
హీరో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ - ''తెలుగు, తమిళ్‌లో వరసగా నా సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. చాలా సంతోషంగా వుంది. నా సినిమాలకు అందరి నుంచి చాలా మంచి పాజిటివ్‌ రిపోర్ట్స్‌ వస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఇకముందు కూడా నేను మీ అందరూ మెచ్చే డీసెంట్‌ మూవీసే చేస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను. ఇంతకుముందు నేను చెప్పాను. నేను చేసే సినిమాలు బాగా రాలేదు అనిపిస్తే రిలీజ్‌ని ఆపేస్తాను. అందుకే నా సినిమాలు నేనే ప్రొడ్యూస్‌ చేస్తున్నాను. 'యమన్‌' చిత్రాన్ని నిర్మాత రవీందర్‌రెడ్డిగారు చూసి బాగా ఎంజాయ్‌ చేశారు. అలాగే సెన్సార్‌ సభ్యులు కూడా సినిమా చూసి మెచ్చుకున్నారు. మా చిత్రానికి తమిళ్‌లో యు సర్టిఫికెట్‌ ఇచ్చారు. కాబట్టి పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరూ కలిసి చూసే సినిమా. ఇది పక్కా యాక్షన్‌, సస్పెన్స్‌, పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ. నా ఫస్ట్‌ మూవీ 'నకిలీ'ని డైరెక్ట్‌ చేసిన జీవశంకర్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. ఆయన బేసిక్‌గా సినిమాటోగ్రాఫర్‌ కావడం వల్ల సినిమా విజువల్‌గా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా స్క్రిప్ట్‌కి తగ్గట్టుగా మ్యూజిక్‌ కంపోజ్‌ చేశాను. అలాగే హీరోయిన్‌ మియా చాలా బాగా పెర్‌ఫార్మ్‌ చేసింది. ఈ సినిమాని రజనీకాంత్‌, శంకర్‌లతో '2.0' చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌.. ఫాతిమా విజయ్‌ ఆంటోని కార్పొరేషన్‌తో కలిసి తమిళ్‌లో నిర్మిస్తున్నారు. తెలుగులో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌లో మిర్యాల రవిందర్‌రెడ్డిగారు రిలీజ్‌ చేస్తున్నారు'' అన్నారు.
విజయ్‌ ఆంటోని, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, సంగిలి మురుగన్‌, చార్లీ, స్వామినాథన్‌, మారిముత్తు, జయకుమార్‌, అరుల్‌ డి. శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, ఎడిటింగ్‌: వీరసెంథిల్‌ రాజ్‌, మాటలు: భాష్యశ్రీ, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి, నిర్మాతలు: మిర్యాల రవిందర్‌రెడ్డి, లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: జీవశంకర్‌.

More News

అనగనగా ఫిల్మ్ కంపెనీ ముక్కోణపు ప్రేమకథ!

ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సలహాలతో అనగనగా ఫిల్మ్ కంపెనీ సంస్థ ఓ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రానికి శ్రీకారం చుట్టింది.

మార్చి 3న చిత్రాంగద

అందం, అభినయం కలగలిసిన తార అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద. తమిళంలో యార్నీ పేరుతో నిర్మిస్తున్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేం అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్లు సంయుక్త

ఏషియన్ స్వప్న 70 ఎం.ఎం ప్రారంభం!

ఏషియన్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో.. ఆధునిక హంగులతో రాజేంద్రనగర్ సమీపంలోని కాటేదాన్లో ఏషియన్ స్వప్న 70ఎం ఎం థియేటర్ శనివారం ప్రారంభమైంది. ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.

'కాటమరాయుడు' నైజాం హక్కులను దక్కించుకున్న....

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కిషోర్ పార్థసాని(డాలీ)దర్శకత్వంలో

ట్రెండ్ క్రియేట్ చేయడానికి సిద్ధమైన పూరి, ఇషాన్ 'రోగ్'...

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్...దర్శకత్వంలో సినిమా అంటే యంగ్ హీరోస్ అందరూ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.