పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన 'మిర్చి' హీరోయిన్

  • IndiaGlitz, [Saturday,June 05 2021]

క్రేజీ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించింది. రిచా 2019లో వివాహం చేసుకుని నటనకు ఫుల్ స్టాప్ పెట్టింది. అమెరికాకు చెందిన తన స్నేహితుడిని వివాహమాడి అక్కడే సెటిల్ ఐంది. నటనను పక్కన పెట్టి మ్యారేజ్ లైఫ్ ని రిచా ఎంజాయ్ చేస్తోంది.

ఇటీవలే రిచా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషాన్ని రిచా తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించింది. మే 27న రిచా తన బిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకుకి నామకరణం కూడా చేశాక ప్రపంచానికి పరిచయం చేసింది. రిచా ముద్దుల కొడుకు పేరు 'లూకా షాన్ లాంగేలా'.

రిచా తన కొడుకు గురించి మరి కొన్ని విషయాలు కూడా తెలియజేసింది. ప్రస్తుతం మేము సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాం. నేను నా భర్త జో మా ముద్దుల కొడుకుతో ప్రేమలో ఉన్నాం. వాడు అచ్చు తండ్రి పోలికే. కాకపోతే ముక్కు, హెయిర్ మాత్రం నా పోలికలు అని రిచా తన కొడుకు గురించి చెప్పుకుంటూ మురిసిపోయింది.

రిచా గంగోపాధ్యాయ తెలుగులో లీడర్, మిరపకాయ్, మిర్చి లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. రిచా తెలుగులో చివరగా 2013లో భాయ్ చిత్రంలో మెరిసింది.

More News

మహేష్, కమల్ హాసన్ పాన్ ఇండియా మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే ?

బాహుబలి ప్రభంజనం తర్వాత సౌత్ లో పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ మొదలయింది. పదుల సంఖ్యలో పాన్ ఇండియా చిత్రాలకు ప్రకటనలు వస్తున్నాయి.

చిరంజీవి సోదరిగా బాలయ్య హీరోయిన్?

ఆచార్య పూర్తయ్యాక మెగాస్టార్ చిరంజీవి మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ లో నటించబోతున్నారు.

ఫ్యామిలీ మ్యాన్ 2 (వెబ్ సిరీస్) రివ్యూ

2019లో విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తొలి సీజన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. రాజ్ అండ్ డీకే దర్శత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు.

స్వీట్ షాక్ : క్రేజీ డైరెక్టర్ తో హీరోయిన్ పెళ్లి.. అంతా సడెన్ గా..

హీరోయిన్ యామి గౌతమ్ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. క్రేజీ డైరెక్టర్ తో ఆమె పెళ్లి గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది.

నన్ను దూరం పెడుతున్నావా అని బాలుగారు కోపంగా అన్నారు : చిరంజీవి

గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు. గత ఏడాది ఆయన మరణించిన సంగతి తెలిసిందే.