పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన 'మిర్చి' హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
క్రేజీ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించింది. రిచా 2019లో వివాహం చేసుకుని నటనకు ఫుల్ స్టాప్ పెట్టింది. అమెరికాకు చెందిన తన స్నేహితుడిని వివాహమాడి అక్కడే సెటిల్ ఐంది. నటనను పక్కన పెట్టి మ్యారేజ్ లైఫ్ ని రిచా ఎంజాయ్ చేస్తోంది.
ఇటీవలే రిచా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషాన్ని రిచా తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించింది. మే 27న రిచా తన బిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకుకి నామకరణం కూడా చేశాక ప్రపంచానికి పరిచయం చేసింది. రిచా ముద్దుల కొడుకు పేరు 'లూకా షాన్ లాంగేలా'.
రిచా తన కొడుకు గురించి మరి కొన్ని విషయాలు కూడా తెలియజేసింది. ప్రస్తుతం మేము సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాం. నేను నా భర్త జో మా ముద్దుల కొడుకుతో ప్రేమలో ఉన్నాం. వాడు అచ్చు తండ్రి పోలికే. కాకపోతే ముక్కు, హెయిర్ మాత్రం నా పోలికలు అని రిచా తన కొడుకు గురించి చెప్పుకుంటూ మురిసిపోయింది.
రిచా గంగోపాధ్యాయ తెలుగులో లీడర్, మిరపకాయ్, మిర్చి లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. రిచా తెలుగులో చివరగా 2013లో భాయ్ చిత్రంలో మెరిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com