Miral:మే 17న ప్రేక్షకులను భయపెట్టనున్న భరత్ 'మిరల్' చిత్రం

  • IndiaGlitz, [Thursday,May 16 2024]

'ప్రేమిస్తే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో భరత్.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ మూవీ ‘మిరల్’తో మే 17న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్ హీరోగా, వాణి భోజన్ హీరోయిన్‌గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన ‘మిరల్’ మూవీని సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి ఎం శక్తివేల్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా నుంచి రీసెంటుగా వదిలిన ట్రైలర్, సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. హీరో తన ఫ్యామిలీతో కలిసి కారులో వెళుతూ ఉండగా, మార్గమధ్యంలో ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ సంఘటన వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది కథ. అద్దంలో చూడకండి సార్ అది వచ్చేస్తుంది .. ఈ వింత మాస్క్ ఎందుకు తీసుకొచ్చారు? అనే మాటలు.. ఈ కథలో ఈ రెండు అంశాలకు ప్రాధాన్యత ఉందనే విషయాన్ని చెబుతున్నాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. థియేటర్స్ లో ఈ సినిమా ఎంతలా భయపెడుతుందనేది చూడాలి. ట్రైలర్‌తో ఒక్కసారిగా మిరల్ మూవీ మీద అంచనాలు పెరిగాయి.

శ్రీమతి జగన్మోహిని మరియు జి. ఢిల్లీ బాబు సమర్ఫణలో రాబోతోన్న ఈ సినిమాను మే 17న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా కథ ఏంటి? ఏ పాయింట్ చుట్టూ తిరుగుతుంది? ప్రధాన పాత్రలు ఏంటి? అన్నది కూడా ఈ పోస్టర్‌లోనే చూపించారు. ట్రైలర్‌లోనూ ఓ వింత మాస్క్ హైలెట్ అయింది. ఇప్పుడు ఈ పోస్టర్‌లోనూ ఆ మాస్క్‌ను చూపించారు. అసలు ఆ మాస్క్ కథ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్, పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇక ఈ చిత్రానికి ప్రసాద్ ఎస్ ఎన్ సంగీతాన్ని అందించారు. సురేష్ బాలా సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ఎడిటర్‌గా కలైవానన్ ఆర్ వ్యవహరించారు.

నటీనటులు: భరత్, వాణి భోజన్, K.S.రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు

More News

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు..

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ ముగిసే నాటికి దాదాపు 75 శాతం పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

తెలంగాణలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని మావోయిస్ట్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.

తాగొచ్చి దుర్భాషలాడాడు.. అందుకే ఓటర్‌ను కొట్టాను.. వైసీపీ అభ్యర్థి క్లారిటీ..

తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ కేంద్రంలో ఓటరుపై చేయి చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో పోలింగ్‌ బహిష్కరించిన పలు గ్రామాలు

తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.  17 లోక్‌స‌భ నియోజకవర్గాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.

Vishaka Train: విశాఖ రైలు 9 గంటలు ఆలస్యం.. ఓటు వేస్తామా..? లేదా..? అనే ఆందోళన..

మన దేశంలో రైళ్ల ప్రయాణం గురించి ఓ సినీ కవి వ్యంగ్యంగా ఓ మాట చెప్పాడు. నువ్వు ఎక్కాల్సిన రైలు.. జీవితకాలం లేటు అని. ఆయన ఆ మాట ఎందుకు చెప్పాడో ఇప్పుడు ఏపీకి వచ్చే కొంతమంది