ఎస్పీబీకి కరోనా పాజిటివ్ అని తేలినప్పటి నుంచి మినిట్ టు మినిట్
- IndiaGlitz, [Friday,September 25 2020]
గాన గంధర్వుడు గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు. కోట్లాది హృదయాల్లో చిచ్చు పెట్టే ఈ వార్తను బాలు కుమారుడు ఎస్పీ చరణ్ దు:ఖ భరిత హృదయంతో వెల్లడించారు. మధ్యాహ్నం 1.04 గం.కు స్వర్గస్తులైనట్లు చరణ్ మీడియా ఎదుట ప్రకటించారు. నాన్న గారు కోలుకోవాలని ప్రార్థనలు చేసిన కోట్లాదిమంది అభిమానులకు ధన్యవాదాలు చరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్తతో దేశం మొత్తం దు:ఖ సాగరంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
బాలుకి కరోనా నిర్ధారణ అయినప్పటి నుంచి మినిట్ టు మినిట్..
ఆగస్ట్ 5: మధ్యాహ్నం గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనకు కరోనా సోకినట్టు వీడియో సందేశం విడుదల చేశారు. రెండు, మూడు రోజులు చికిత్స పొందితే నయమవుతుందని వెల్లడించారు.
ఆగస్ట్ 14: ఎస్పీబీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెన్నై, ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇదే రోజున ప్రముఖ దర్శకుడు మనోబాలా ఎస్పీబీ ఐసీయూలో ఉన్న ఫోటోను ప్రసార మాధ్యమాల్లో విడుదల చేశారు.
ఆగస్ట్ 15 : ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ రజినీకాంత్ వీడియో సందేశం ద్వారా తెలిపారు.
ఆగస్ట్ 19: ఎస్పీబీకి ఐసీయూలో ఎక్మో సాయంతో వెంటిలేటర్ ద్వారా చికిత్సను అందిస్తున్నామని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి.
ఆగస్ట్ 20: ఎస్పీబీ కోలుకోవాలని సాయంత్రం ఆరు గంటలకు సినీ సంగీత దర్శకులు, కళాకారులు, నటీనటులు సామూహిక ప్రార్థన నిర్వహించారు.
ఆగస్ట్ 24: ఎస్పీ బాలు కరోనా గండం నుంచి బయటపడ్డారని నెగటివ్ వచ్చిందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ పీఆర్వో ప్రకటన జారీ చేశారు.
కాసేపటికే తన పీఆర్వో ఇచ్చిన ప్రకటన అవాస్తవమని చరణ్ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.
ఆగస్ట్ 25: ఎస్పీబీ ఆరోగ్యం నిలకడగా ఉందని, తరచూ స్పృహలోకి వస్తున్నారని చరణ్ ప్రకటించారు
సెప్టెంబర్ 4: తన తండ్రి త్వరగా కోలుకుంటారని మూడు రోజుల తర్వాత అభిమానులు శుభవార్త వినబోతున్నారని చరణ్ ప్రకటించారు.
సెప్టెంబర్ 7: ఎస్పీబీ అభిమానులకు చరణ్ శుభవార్త తెలిపారు. తన తండ్రికి జరిపిన వైద్య పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని చరణ్ ప్రకటించారు.
సెప్టెంబర్ 10: ఎస్పీబీ డిశ్చార్జ్ కాబోతున్నారనే వార్తలను చరణ్ ఖండించారు
సెప్టెంబర్ 12: ఎస్పీబీ కాసేపు కూర్చోగలుగుతున్నారని.. శ్వాస ప్రక్రియ మెరుగైందని చరణ్ ప్రకటించారు.
సెప్టెంబర్ 20: ఎస్పీబీ తేలికపాటి ఆహారాన్ని నోటి ద్వారా స్వీకరిస్తున్నారని చరణ్ ప్రకటన
సెప్టెంబర్ 24: ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఎంజీఎం ఆసుపత్రి బులిటెన్ జారీ
సెప్టెంబర్ 25 : మధ్యాహ్నం 1:04 గంటలకు గాన గంధర్వుడు పరమపదించారని ఎస్పీ చరణ్ వెల్లడి.