ప్రధాని మోదీ నివాసంలో మంటలు.. ఎన్నో అనుమానాలు!!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రధాని మోదీ అధికార నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 7:25 గంటల సమయంలో లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 9 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రమాదం ఎలా సంభవించింది..? ఎక్కడ లోపం జరిగింది..? షార్ట్ సర్క్యట్‌ల ప్రమాదం జరిగిందా..? లేకుంటే మరేమైనా కారణాలున్నాయా..? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఉండే ప్రధాని నివాసంలో అగ్ని ప్రమాదం తలెత్తడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు.. ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని నివాసానికి వెళ్లే మార్గాలను మూసివేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు అధికారులను అలెర్ట్ చేశారు. కాగా మోదీ నివాసముండే ప్రాంతంలోనే కేంద్ర మంత్రులు, జాతీయ ప్రముఖులు నివసిస్తుంటారు. కాగా.. గతంలో దీన్ని 7RCR అని పిలవగా.. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోక్ కళ్యాణ్ మార్గ్‌గా పేరుమార్చడం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments