ప్రధాని మోదీ నివాసంలో మంటలు.. ఎన్నో అనుమానాలు!!

ప్రధాని మోదీ అధికార నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 7:25 గంటల సమయంలో లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 9 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రమాదం ఎలా సంభవించింది..? ఎక్కడ లోపం జరిగింది..? షార్ట్ సర్క్యట్‌ల ప్రమాదం జరిగిందా..? లేకుంటే మరేమైనా కారణాలున్నాయా..? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఉండే ప్రధాని నివాసంలో అగ్ని ప్రమాదం తలెత్తడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మరోవైపు.. ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని నివాసానికి వెళ్లే మార్గాలను మూసివేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు అధికారులను అలెర్ట్ చేశారు. కాగా మోదీ నివాసముండే ప్రాంతంలోనే కేంద్ర మంత్రులు, జాతీయ ప్రముఖులు నివసిస్తుంటారు. కాగా.. గతంలో దీన్ని 7RCR అని పిలవగా.. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోక్ కళ్యాణ్ మార్గ్‌గా పేరుమార్చడం జరిగింది.

More News

అజిత్‌కు కలిసొచ్చిన లక్.. ఆదిథ్యకు కొత్త శాఖ!

ఎవరి జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. ఎవరికెప్పుడు లక్ కలిసొస్తుందో.. ఎప్పుడు సామాన్యుడు సెలబ్రిటీ అవుతాడో ఎవరికీ అర్థంకాదు.

వాళ్లంతా వెధ‌వ‌లు: రామ్ గోపాల్ వ‌ర్మ‌

``ఓ దర్శ‌కుడు ఓ సినిమాను తీయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. ఏ ద‌ర్శ‌కుడు చెత్త సినిమా తీయాల‌ని అనుకోడు.

'అశ్వ‌థ్థామ' డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌శౌర్య‌

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో

'పల్లెవాసి' టీజర్ ను ఆవిష్క‌రించిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో నటుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమై, కిరాక్ పార్టీతో అలరించిన నటుడు రాకేందు మౌళి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం` పల్లెవాసి`.

'రంగ‌మార్తాండ' మ్యూజిక్ సిట్టింగ్స్‌

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ తెర‌కెక్కిస్తున్న చిత్రం `రంగ‌మార్తాండ‌`. ప్ర‌కాశ్‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.