KCR: సీఎం కేసీఆర్ నియోజకవర్గాల ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

  • IndiaGlitz, [Tuesday,October 24 2023]

ఎన్నికల వేళ సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. అక్టోబర్ 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు. అలాగే అక్టోబర్ 27న పాలేరు, మహబూబాబాద్‌తోపాటు వర్ధన్నపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. వాస్తవానికి అక్టోబర్ 26న అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడులో కేసీఆర్ పర్యటించాల్సి ఉండగా.. నాగర్ కర్నూలులో ఏర్పాటుచేయాల్సిన సభను వనపర్తికి మార్చారు. ఇక 27న స్టేషన్‌ ఘన్‌పూర్ లలో పర్యటించాల్సి ఉండగా.. మహబూబాబాద్‌లో సభ ఏర్పాటు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

అక్టోబర్ 15న హుస్నాబాద్ సభతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే అభ్యర్థుల కోసం మొదటి విడత ప్రచారం పూర్తి చేశారు. ఇక అక్టోబర్ 26 నుంచి రెండో విడత ప్రచారం మొదలు పెట్టనున్నారు. నవంబర్ 9 వరకు అన్ని జిల్లాల్లో రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పూర్తయ్యేలా పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది.

కేసీఆర్ నియోజకవర్గాల ప్రచార షెడ్యూల్..

అక్టోబర్ 26 - అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు
అక్టోబర్ 27 - పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేట
అక్టోబర్‌ 29 - కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్‌ 30 - జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌
అక్టోబర్‌ 31 - హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్‌ 01 - సత్తుపల్లి, ఇల్లెందు
నవంబర్‌ 02 - నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి
నవంబర్‌ 03 - భైంసా(ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల
నవంబర్‌ 05 - కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్‌ 06 - గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట
నవంబర్‌ 07 - చెన్నూరు, మంథని, పెద్దపల్లి
నవంబర్‌ 08 - సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి
నవంబర్‌ 09 - గజ్వేల్‌, కామారెడ్డి

నవంబర్ 9వ తేదిన మధ్యాహ్నం 1-2 గంటల మధ్య గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2- 3 గంటల మధ్య కామారెడ్డిలోనూ నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మొత్తానికి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గులాబీ బాస్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు.

More News

Pawan Kalyan: ఈనెల 27న అమిత్‌ షాతో పవన్ కల్యాణ్‌ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..

ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎత్తులు పైఎత్తులతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Medigadda Barrage: మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ని పరిశీలించిన కేంద్ర బృందం

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ని కేంద్ర బృందం పరిశీలించింది. వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

Srilanka: శ్రీలంక వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్ న్యూస్.. ఇక ఆ అవసరం లేదు..

శ్రీలంక ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. ఇక నుంచి వీసా అవసరం లేకుండానే తమ దేశం రావొచ్చని ప్రకటించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana TDP: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీపై కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉందనే ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కుట్ర ప్రకారం విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Mega156: మెగా 156 షూటింగ్ మొదలు.. ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దసరా పండుగ ట్రీట్ ఇచ్చారు. 156వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది.