KCR: సీఎం కేసీఆర్ నియోజకవర్గాల ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల వేళ సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. అక్టోబర్ 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు. అలాగే అక్టోబర్ 27న పాలేరు, మహబూబాబాద్‌తోపాటు వర్ధన్నపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. వాస్తవానికి అక్టోబర్ 26న అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడులో కేసీఆర్ పర్యటించాల్సి ఉండగా.. నాగర్ కర్నూలులో ఏర్పాటుచేయాల్సిన సభను వనపర్తికి మార్చారు. ఇక 27న స్టేషన్ ఘన్‌పూర్ లలో పర్యటించాల్సి ఉండగా.. మహబూబాబాద్‌లో సభ ఏర్పాటు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
అక్టోబర్ 15న హుస్నాబాద్ సభతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే అభ్యర్థుల కోసం మొదటి విడత ప్రచారం పూర్తి చేశారు. ఇక అక్టోబర్ 26 నుంచి రెండో విడత ప్రచారం మొదలు పెట్టనున్నారు. నవంబర్ 9 వరకు అన్ని జిల్లాల్లో రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పూర్తయ్యేలా పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది.
కేసీఆర్ నియోజకవర్గాల ప్రచార షెడ్యూల్..
అక్టోబర్ 26 - అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు
అక్టోబర్ 27 - పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేట
అక్టోబర్ 29 - కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్ 30 - జుక్కల్, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్
అక్టోబర్ 31 - హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్ 01 - సత్తుపల్లి, ఇల్లెందు
నవంబర్ 02 - నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
నవంబర్ 03 - భైంసా(ముధోల్), ఆర్మూర్, కోరుట్ల
నవంబర్ 05 - కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్ 06 - గద్వాల్, మఖ్తల్, నారాయణపేట
నవంబర్ 07 - చెన్నూరు, మంథని, పెద్దపల్లి
నవంబర్ 08 - సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి
నవంబర్ 09 - గజ్వేల్, కామారెడ్డి
నవంబర్ 9వ తేదిన మధ్యాహ్నం 1-2 గంటల మధ్య గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2- 3 గంటల మధ్య కామారెడ్డిలోనూ నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మొత్తానికి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గులాబీ బాస్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments