Talasani Srinivas Yadav:చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు అరెస్టును తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. "మాజీ ముఖ్యమంత్రి, TDP అధినేత చంద్రబాబు గారి అరెస్ట్ చాలా బాధాకరం. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను... వారి అరెస్ట్ వ్యక్తిగతంగా నాకెంతో బాధను కలగచేసింది. అధికారం శాశ్వతం కాదు ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు చంద్రబాబునాయుడి గారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం. సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు" అని తలసాని ట్వీట్ చేశారు.
చంద్రబాబు అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు..
ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించిన సంగతి తెలిసిందే. మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, అరికపూడి గాంధీ వంటి నేతలు చంద్రబాబు అరెస్టును తప్పుబట్టారు. ఇక ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరస్సింహులు అయితే ఏపీ సీఎం జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష కూడా చేశారు. అయితే మంత్రి కేటీఆర్ మాత్రం భిన్నంగా స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో రెండు పార్టీలకు సంబంధించిన అంశమని.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేస్తే అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ అని జాతీయ పార్టీ పెట్టి ఏపీలో పార్టీ ఆఫీసు ఎందుకు పెట్టారని.. లిక్కర్ స్కాం వ్యవహారంపై ఢిల్లీలో ఎందుకు దీక్షలు చేశారని కౌంటర్ ఎటాక్‌కు దిగారు.
కేటీఆర్ స్పందన విషయంలో సెటిలర్లలో తీవ్ర అసంతృప్తి..
చంద్రబాబు అరెస్టు విషయంలో కేటీఆర్ స్పందనతో సెటిలర్లలో తీవ్ర అసంతృప్తి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సెటిలర్లు దాదాపు 20-30 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరన్నారు. అందుకే ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, నిజామాబాద్‌లో నిర్వహించిన నిరసన ర్యాలీల్లో సాక్షాత్తూ బీఆర్ఎస్ నేతలే పాల్గొన్నారు. అయితే చంద్రబాబు అరెస్టుపై ఎక్కువగా స్పందించిన నేతల్లో ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన నేతలే ఉండడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com