అక్కికి మంత్రి మద్దతు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ పౌరసత్వంపై కొన్నిరోజులుగా పెద్ద చర్చే జరుగుతుంది. అక్షయ్ తన ట్విట్టర్ ద్వారా తనకు భారత పౌరసత్వం లేదని, అయితే తన దేశభక్తిని ఎవరి కోసమో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రెజుజూ అక్షయ్‌కు తన సపోర్ట్ అందించారు.
``సాయుధ దళాలు చనిపోయినప్పుడు మీరు భారత్‌కే వీర్ ద్వారా విరాళాలు సేకరించిన విధానం, మీరు స్పందించివిరాళాలు సేకరించిన తీరు.. మీరు ఓ భారతీయుడనడానికి అసలైన ఉదాహరణ. మీ దేశభక్తిని ఎవరూ శంకించలేరు`` అంటూ కిరెన్ రిజుజూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై అక్షయ్ స్పందిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. భారత ఆర్మీ పట్ల, భారత్ కే వీర్ కార్యక్రమం పట్ల నా బాధ్యత ఎప్పటికీ స్థిరంగా ఉంటుందని అన్నారు అక్షయ్‌కుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments