అక్కికి మంత్రి మ‌ద్ద‌తు

  • IndiaGlitz, [Wednesday,May 08 2019]

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ పౌర‌స‌త్వంపై కొన్నిరోజులుగా పెద్ద చ‌ర్చే జ‌రుగుతుంది. అక్ష‌య్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా త‌న‌కు భార‌త పౌర‌స‌త్వం లేద‌ని, అయితే త‌న దేశ‌భ‌క్తిని ఎవ‌రి కోస‌మో నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ విష‌యంపై కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిరెన్ రెజుజూ అక్ష‌య్‌కు త‌న స‌పోర్ట్ అందించారు.

''సాయుధ ద‌ళాలు చ‌నిపోయిన‌ప్పుడు మీరు భార‌త్‌కే వీర్ ద్వారా విరాళాలు సేక‌రించిన విధానం, మీరు స్పందించివిరాళాలు సేక‌రించిన తీరు.. మీరు ఓ భార‌తీయుడ‌న‌డానికి అస‌లైన ఉదాహ‌ర‌ణ‌. మీ దేశ‌భ‌క్తిని ఎవ‌రూ శంకించ‌లేరు'' అంటూ కిరెన్ రిజుజూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై అక్ష‌య్ స్పందిస్తూ ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. భార‌త ఆర్మీ ప‌ట్ల‌, భార‌త్ కే వీర్ కార్య‌క్ర‌మం ప‌ట్ల నా బాధ్య‌త ఎప్ప‌టికీ స్థిరంగా ఉంటుందని అన్నారు అక్ష‌య్‌కుమార్‌.