మంత్రి సోమిరెడ్డి పతనం మొదలైనట్లేనా..!?
- IndiaGlitz, [Thursday,January 24 2019]
ఏపీ మంత్రి సోమిరెడ్డి పతనం మొదలైనట్లేనా..? ఇక నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి పోటీచేసి గెలవాలన్న ఆశ ఆయనలో చచ్చిపోయిందా..? ఇప్పటికే వరుసగా ఓడిపోయిన సోమిరెడ్డి ఈసారైనా గెలుద్దామని వర్కవుట్ చేస్తున్న టైమ్‌లో అసలెందుకిలా జరుగుతోంది..? నా అనుకున్నోళ్లంతా సోమిరెడ్డికి ఎందుకు దూరమవుతున్నారు.? సొంత బావే ఆయనకు దూరమవ్వడం వెనుక పెద్ద కథే నడించిందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదంతా నిజమేనని అనిపిస్తోంది.
సొంతిటోళ్లే సోమిరెడ్డిని నమ్మట్లేదా..?
సోమిరెడ్డిని స్వయానా ఆయన బావ రామకోట సుబ్బారెడ్డే నమ్మట్లేదేమో..! కానీ గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న జిల్లా వైసీపీ చెందిన నేతలు ఆయన్ను సంప్రదించడం.. కొన్ని గంటల వ్యవధిలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో రామకోట, ఆయన కొడుకులు శశిధర్‌రెడ్డి, కళాధర్ రెడ్డి పార్టీలో చేరారు. ఇది సోమిరెడ్డికి కోలుకోలేని షాక్ అనిచెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సోమిరెడ్డిపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకూ నియోజకవర్గ ప్రజలు ఆయన్ను నమ్మక ఓటేయలేదని.. ఇప్పుడు ఏకంగా ఆయన కుటుంబీకులే సోమిరెడ్డిని నమ్మట్లేదని దీన్ని బట్టి అర్థం చేస్కోవచ్చంటూ విమర్శకులు తీవ్ర స్థాయిలో దుమారం రేపే వ్యాఖ్యలు చేస్తున్నారు.
కాగా.. సోమిరెడ్డి రాజకీయ అరంగేట్రం చేసింది మొదలుకుని.. ఇప్పటి వరకూ ఆయన పోటీ చేసిన ప్రతి ఎలక్షన్లో రామకోట అన్నీ తానై చూసుకున్నారు. అలా అన్ని రకాలుగా అండగా ఉంటూ వస్తున్న ఆయన ఒక్కసారిగా వైసీపీ గూటిలో కనపబడటంతో కంగుతిన్న సోమిరెడ్డి ప్రత్యామ్నాయంగా ఎవర్ని ఎంపిక చేసుకోవాలే అర్థం కాని పరిస్థితి. 2019 ఎన్నికల్లో తాను కాకుండా తన కుమార్‌ని బరిలోకి దింపాలనుకుంటున్న సోమిరెడ్డి భవితవ్యమేంటన్నది ప్రశ్నార్థమే. మున్ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయ్..? అయితే ఈ వలసలు సోమిరెడ్డి బావతోనే ముగుస్తాయా..? లేకుంటే మరికొంత మంది వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతారా..? అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజలు ఆగాల్సిందే మరి.