TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణలో 15 జోన్లు, ఏపీలో 6 జోన్‌లలో పరీక్షలను నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో 79 శాతం మంది బాలురు, 82 శాతం మంది బాలికలు పాస్ అవ్వగా.. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 84 శాతం మంది అబ్బాయిలు, 87 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి మంత్రి సబిత అభినందనలు తెలిపారు.
రెండు విభాగాల్లోనూ టాప్ 5లో నలుగురు ఏపీ వాళ్లే :
అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి వెల్లడించారు. ఈ స్ట్రీమ్‌లో 1,10,544 మంది పరీక్షలు రాయగా.. 91,935 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,53,890 మంది తెలంగాణ విద్యార్ధులు పరీక్షలు రాయగా.. ఏపీ నుంచి 51,461 మంది పరీక్షలు రాశారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. ఇంజనీరింగ్ విభాగంలో విశాఖపట్నానికి చెందిన సనపల్ల అనిరుధ్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కేటగిరీలో టాప్ 5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన విద్యార్ధులే వుండటం గమనార్హం. జూన్‌లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం వుంది. స్థానిక విద్యార్ధుల కోసం 85 శాతం , స్థానికేతరుల కోసం 15 శాతం సీట్లు కేటాయించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments