Inter Results:తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల .. బాలికలదే పైచేయి, ఉత్తీర్ణత శాతం ఏంతంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫస్టియర్‌లో 63.85 శాతం, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్లియర్ ఫలితాల్లో మేడ్చల్ 75.27 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలవగా.. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా 85.08 శాతం ఉత్తీర్ణతతో తొలిస్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో 2,72,208 మంది విద్యార్ధులు పాసవ్వగా.. సెకండియర్‌లో 2,56,241 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.
బాలురపై బాలికలదే పైచేయి:
ఇంటర్ ఫస్టియర్ లో 56.80 శాతం మంది బాలురు ఉత్తీర్థులవ్వగా... 68.85 శాతం బాలికలు పాసయ్యారు. రెండు సంవత్సరాల్లోనూ బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 60.44 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో 73.46 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.
జూన్ 3 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ :
జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫెయిలైన విద్యార్ధులు ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి పేర్కొన్నారు. విద్యార్ధులపై ఒత్తిడి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈసారి ఎంసెట్‌లో ఇంటర్ మార్క్‌లకు వెయిటేజీ తగ్గించినట్లు సబిత చెప్పారు. కాగా.. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఫస్ట్, సెకండియర్ కలికి 9.47 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఒక నెల ముందుగానే ఫలితాలు విడుదల చేసింది ప్రభుత్వం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments