RK Roja : మోడీ సభలో సందడంతా ఆమెదే : ప్రధాని , సీఎం, చిరంజీవితో సెల్ఫీ తీసుకున్న రోజా.. ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
మన్యం వీరుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ కార్యక్రమం ముగింపు సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
మోడీ, చిరంజీవిలతో రోజా సెల్ఫీ:
ప్రధాని పాల్గొన్న సభలో మంత్రి, సినీనటి రోజా సందడి చేశారు. కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన ఆమె.. అందరికీ ఏం కావాలో చూసుకుంటూ సభ విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్ లతో సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాత ఇదే కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవితోనూ ఆమె సెల్ఫీ దిగారు.
అభిమానిగా ఆటోగ్రాఫ్ తీసుకుని.. చిరంజీవి పక్కన హీరోయిన్గా:
కాగా.. మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పలుమార్లు గుర్తు చేసుకునేవారు రోజా. ఆయనకి తాను అభిమానురాలినని, ఆయనతో నటించడం గొప్ప అనుభూతి అని చెప్పేవారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ తాను.. చిరంజీవి పక్కన అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒకానొక సందర్భంలో ప్రకటించారు. చిరంజీవి సెట్స్‌లో తనను బాగా చూసుకునేవారని రోజా చెప్పారు. ఆయన నటించిన ‘ఆలయ శిఖరం’ సినిమా సెట్స్‌కు వెళ్లి చిరంజీవితో తన చేతిపై ఆటోగ్రాఫ్ తీసుకున్నానని రోజా గుర్తుచేసుకున్నారు. అలాంటి తాను ఆయనతో హీరోయిన్గా సినిమాలు చేయడాన్ని తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ఒక అభిమాని తన అభిమాన హీరో సరసన హీరోయిన్గా చేయడం చాలా అరుదని.. కానీ, ఆ అవకాశం తనకు లభించిందని రోజా పలు వేదికలపై చెప్పేవారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments