RK Roja : ఆయనంటే భయం.. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి తరిమేశారు : చంద్రబాబుపై రోజా వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా ఫైరయ్యారు. శనివారం నగరి నియోజకవర్గ నేతలతో కలిసి ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన శని అని గతంలోనే దివంగత ఎన్టీ రామారావు అన్నారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ప్రాణాలు తీసేసి.. నేడు ఆయన ఫోటోకి దండలు వేసి, దండం పెడుతున్నారని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకి పెడితే.. చంద్రబాబు కనీసం కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదని దుయ్యబట్టారు.
జగన్‌ను తిట్టడానికే మహానాడు:
ఎన్టీఆర్ బతికే ఉంటే చంద్రబాబు పరిస్థితి ఎంటో అందరికీ తెలుసునంటూ చురకలు వేశారు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్‌కు భయపడి పార్టీ నుంచి ఆయన్ను తరిమేసారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను, తమను తిట్టడానికే మహనాడు నిర్వహిస్తున్నారని ఫైరయ్యారు. తాము చేసిన తప్పులను మహానాడులో సరిదిద్దుకోకుండా.. జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని రోజా దుయ్యబట్టారు.
కోనసీమ అల్లర్లకు పాల్పడ్డ వారిని వదిలేది లేదు :
అలాగే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెడితే దళిత మంత్రి, బీసీ ఎమ్మేల్యే ఇళ్లకు టీడీపీ, జనసేన నాయకులు నిప్పు పెట్టారని మంత్రి రోజా ఆరోపించారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్యగా అభివర్ణించిన ఆమె.. అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని ప్రశంసించారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటి వాళ్లయినా వదిలేదేలేదని రోజా హెచ్చరించారు. అలాగే, గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో 99 శాతం మంది ప్రజలు తమను ప్రేమతో ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.1.35 లక్షల కోట్లు జమ చేశామని మంత్రి రోజా వెల్లడించారు.
లోకేశ్ పనికిరాడనే, పవన్ కల్యాణ్‌ను పక్కనపెట్టుకున్నాడు :
చంద్రబాబు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడని.., తన పుత్రుడు ముద్దపప్పు ఎందుకు పనికిరాడని, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని అడిగిన టీడీపీ, జనసేన నాయకులే విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు 14 ఏళ్లలో చేయలేనిది.. జగన్ మూడేళ్లలో చేసి చూపించారని రోజా ప్రశంసించారు. చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా, మహిళలతో తిట్టించినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి రోజా స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments