Minister Roja:కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా.. మీ ఇంట్లో ఆడవాళ్లకు కూడా ఇలాగే జరిగితే ఊరుకుంటారా..?

  • IndiaGlitz, [Tuesday,October 03 2023]

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనపై చేసిన వ్యాఖ్యలను మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు బండారు వ్యాఖ్యలను సమర్థించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్‌తో పాటు ఇతర టీడీపీ నేతలు సత్యనారాయణ అరెస్టును ఖండించడంపై రోజా వాపోయారు. వారి తల్లులు, భార్యలు, కుమార్తెలకు ఇలాగే జరిగితే సమర్థిస్తారా అని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చానో ఆ రోజు నుంచి తనను వేధిస్తున్నారని తెలిపారు. బ్లూ ఫిల్మ్స్‌లో నటించారని పదే పదే టార్చర్ చేశారన్నారు. అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారని.. కానీ నిరూపించలేదన్నారు.

బండారును వదిలిపెట్టను.. పరువునష్టం దావా కూడా వేస్తా..

మహిళలను నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పిందని. అసలు మీరెవరు తన క్యారెక్టర్ జడ్జ్ చేయడానికి అని మండిపడ్డారు. టీడీపీ నేతలు మహిళలను ఆట వస్తువుల్లా చూస్తోందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్‌ అయ్యారని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయ కక్ష సాధింపు ఏం లేదన్నారు. లోకేష్ సతీమణి బ్రాహ్మణి అబద్ధాలు మాట్లాడారు కాబట్టే తాను వాటిని ఖండించానని చెప్పారు. అందుకని తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అని వాపోయారు. బండారు సత్యనారాయణను వదలనని.. కోర్టులో ఆయనపై పరువునష్టం దావా కూడా వేస్తానని ఆమె వెల్లడించారు. టీడీపీ ఓ సినిమా వ్యక్తి పెట్టిన పార్టీ అని.. సినిమా వాళ్ళంటే అంత లోకువా? మీ ఇంట్లో ఉన్నవారే ఆడవాళ్లా? వైసీపీలో ఉన్న వాళ్ళు కాదా? అని ప్రశ్నించారు.

బండారు వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్.. అరెస్టు

కాగా రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైజాగ్ నుంచి గుంటూరులోని నగరంపాలెంకు తీసుకొచ్చి అక్కడి పోలీస్ట్ స్టేషన్‌లో ఉంచారు. అరెస్టుపై ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు బండారు వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మహిళల పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ మంత్రినే నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతుంటే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. బండారు వ్యాఖ్యలపై సీరియస్ అయిన మహిళ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

More News

Chiranjeevi : త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మెగాస్టార్ .. అలాంటి ఇలాంటి ప్రాజెక్ట్ కాదు..!!

ఆసక్తికరమైన కథలకు, పంచ్ డైలాగ్‌లకు పెట్టింది పేరు త్రివిక్రమ్. ఆయన కలం నుంచి వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి.

Nobel Prizes:భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరంచిన నోబెల్ బహుమతులు

2023 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.

Narendra Modi:కేసీఆర్‌ నన్ను కలిశారు.. నా కళ్లలోకి చూసే ధైర్యం లేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మోదీ..

Chandra Babu:సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ 9వ తేదికి వాయిదా

స్కిల్ డెవలెప్మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది.

తెలంగాణకు వచ్చిన కేంద్ర ఎన్నికల బృందం.. ఈనెల 6 తర్వాత షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్!

తెలంగాణలో ఎన్నికలకు వేళాయైంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.