మంత్రి రోజా ఘోరంగా మోసం చేశారు.. వైసీపీ కౌన్సిలర్ తీవ్ర ఆరోపణలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ మంత్రి రోజాపై వైసీపీకి చెందిన పుత్తూరు 17వ వార్డ్ కౌన్సిలర్ భువనేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం రూ.70 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. ముందుగా రూ.40 లక్షలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. రిజర్వేషన్ ఉండటంతో తనకు చైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని.. ఏకగ్రీవంగా గెలిచిన వెంటనే పదవిపై భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. మిగిలిన విషయాలను తన సోదరుడు కుమారస్వామి రెడ్డితో మాట్లాడమని చెప్పారని.. ఆయన డబ్బులు డిమాండ్ చేశారని చెప్పుకొచ్చారు.
3 విడతల్లో డబ్బులు ఇచ్చాం..
కుమారస్వామిరెడ్డి అనుచరుడు సత్యకు 3 విడతల్లో రూ.40 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఒకసారి రూ.20 లక్షలు.. మరోసారి రూ.7 లక్షలు, ఇంకోసారి రూ.3 లక్షలు, మరో రూ.10లక్షలు ఇచ్చినట్లు వివరించారు. డబ్బులు ఇచ్చినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కొన్ని వీడియోలను ప్రదర్శించారు. రెండో విడతలో ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పారని.. రెండు సంవత్సరాలు అయిపోయాక అడిగితే.. మరో ఆరు నెలలు ఆగామన్నారని తెలిపారు. ఇప్పుడు అడిగితే ఎన్నికల తర్వాత పదవి ఇస్తామని మాయ మాటలు చెబుతున్నారని వాపోయారు.
డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన..
ఎన్నికల తర్వాత పదవి అవసరం లేదని.. తాము ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు గురించి రోజాకు మెసేజ్ చేసినా కనీసం స్పందన లేదన్నారు. రోజా సోదరుడు మాత్రం తిరిగి రూ.29 లక్షలు మాత్రమే ఇస్తామన్నారని.. కనీసం ఆ డబ్బులైనా ఇవ్వమంటే అవి కూడా ఇవ్వడం లేదన్నారు. మంత్రిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించడం లేదని చెప్పుకొచ్చారు. దళిత మహిళను అయిన తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరుతున్నానని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఆరోపణలపై స్పందించని రోజా..
అయితే కౌన్సిలర్ చేసిన ఆరోపణలపై ఇటు మంత్రి రోజా కానీ.. అటు ఆమె సోదరుడు కుమారస్వామి రెడ్డి కానీ స్పందించలేదు. ఏకంగా మంత్రికే డబ్బులు ఇచ్చానంటూ ఆమె చేసిన అవినీతి ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రోజాపై నియోజవర్గానికి చెందిన నేతలు తీవ్ర అనినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. మరి అధిష్టానం పెద్దలు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com