RK Roja:నేను జబర్దస్త్ ఆంటీనైతే.. మీ అమ్మ హెరిటేజ్ ఆంటీ, నీ భార్య హెరిటేజ్ పాపా : లోకేష్‌కు రోజా స్ట్రాంగ్ కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
తనపై టీడీపీ యువనేత నారాల లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటరిచ్చారు మంత్రి ఆర్‌కే రోజా. తాను జబర్దస్త్ ఆంటీ అయితే.. మీ అమ్మను హెరిటేజ్ ఆంటీ అనాలా అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ భార్యను హెరిటేజ్ పాప అనాలా అని రోజా ప్రశ్నించారు. దాదాపు 30 ఏళ్లుగా తాను సినీ ఇండస్ట్రీలో వున్నానని.. లోకేష్‌ది అవినీతి సొమ్మా, నాది అవినీతి సొమ్మా అనే దానిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని రోజా సవాల్ విసిరారు . చంద్రబాబు పొలంలో ఎర్రదుంగలు ఎలా వచ్చాయో ఇంకా తేలలేదని మంత్రి వ్యాఖ్యానించారు. హెరిటేజ్ వాహనాల్లో ఎర్రచందనాన్ని ఎలా తరలించారో అందరికీ తెలుసునని ఆమె సెటైర్లు వేశారు.
లోకేష్ వచ్చాకే టీడీపీ ఖతం: రోజా
జగన్ పులి అయితే లోకేష్ పులకేశి అని రోజా కౌంటర్లు వేశారు. చంద్రబాబు, లోకేష్‌లు దొంగల మాదిరిగా రాష్ట్రానికి వచ్చి పోతున్నారని.. లోకేష్ జగన్ ముందుకు వస్తే గుండె ఆడి చస్తాడంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు మేనిఫెస్టో ఒక పవిత్ర గ్రంథమని.. తమ పార్టీ నేతల గురించి తప్పుగా మాట్లాడితే పళ్లు రాళ్లగొడతానని రోజా హెచ్చరించారు. తాను కష్టపడి సినిమాల్లో సంపాదించుకున్నానని.. టీడీపీ కోసం పనిచేసిన వారిని గాలికొదిలేసిన చరిత్ర లోకేష్ కుటుంబానిదని ఆమె దుయ్యబట్టారు. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాకే టీడీపీ నాశనమైందని రోజా ఆరోపించారు. ఆయన పాదయాత్రకు జనం రాకపోవడంతో లోకేష్‌లో ఫ్రస్టేషన్ పెరిగిందని.. అందుకే బూతులు మాట్లాడుతున్నాడని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఐరెన్ లెగ్ అని.. అంకుల్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. పాదయాత్రకు జనం రాకపోవడంతో చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారని రోజా ఆరోపించారు.
రోజాను ఆంటీ అన్న లోకేష్ :
కాగా.. యువగళం పాదయాత్రలో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో లోకేష్ నిన్న పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. జబర్దస్త్‌గా రోజా ఆంటీ భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. జబర్దస్త్ ఆంటీకి ఊరికో విల్లా వుందని, టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన స్థలానికి సంబంధించి దళితుల వద్ద నుంచి 20 శాతం కమీషన్ అడిగారని నారా లోకేష్ ఆరోపించారు. తనను ఆపడానికి వెయ్యి మంది పోలీసులు, 20 మంది ఎంపీలు ప్రయత్నించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబీకుల పాదయాత్రలలో మైకులను చంద్రబాబు ఎప్పుడైనా లాక్కున్నారా అని లోకేష్ ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout