close
Choose your channels

Minister RK Roja:దళపతి కాదు.. దళారి, చంద్రబాబు కోసమే ఎన్డీయే సమావేశానికి : పవన్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

Wednesday, July 19, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఎన్డీయే సమావేశం, ఢిల్లీ పర్యటనపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ దళపతి కాదు, దళారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోసం పవన్ ఢిల్లీలో దళారిగా మారాడని మంత్రి దుయ్యబట్టారు. కాపు సామాజిక వర్గం, జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తన తల్లిని తిట్టినవాడి కోసం పవన్ దళారిగా మారడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిన చంద్రబాబుని ఎన్డీయే సమావేశానికి పిలవలేదని.. కానీ తన తల్లిని తిట్టించిన చంద్రబాబు కోసం పవన్ కలిసిపోయాడని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పొత్తు పెట్టుకుంటే గొంతు కోసుకుంటానని.. ఇప్పుడేమో కాళ్లు పట్టుకుంటున్నాడు :

కొత్తగా పొత్తు పెట్టుకోవడానికి పార్టీలు లేక పవన్ కల్యాణ్ మళ్లీ టీడీపీ, బీజేపీలతోనే పొత్తు పెట్టుకున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. పవన్ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొత్తులు పెట్టుకుంటే గొంతు కోసుకుంటానన్న పవన్ ఇప్పుడు అందరి కాళ్లు పట్టుకుంటున్నాడని ఆమె ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఎన్ని లేఖలు రాసినా ఎన్డీయే సమావేశానికి ఆహ్వానం అందలేదు.. ఆయన ఎలాంటివాడో బీజేపీకి బాగా తెలుసునని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానన్న చంద్రబాబు.. చివరికి కాంగ్రెస్‌ను కూడా మోసం చేశారంటూ ఆమె ఎద్దేవా చేశారు.

పవన్‌‌ను అడ్డు తొలగించేందుకు కుట్ర :

మరోవైపు.. నిన్న ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రెండోసారి అధికారంలోకి రాగానే కొందరి అకౌంట్లు సెటిల్ చేస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను శాశ్వతంగా అడ్డు తొలగించేందుకు ఆయనతోనే లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. పవన్ గ్రాఫ్ పడగొట్టేందుకు పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీని మూయించే వరకు చంద్రబాబు నిద్రపోలేదని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment