ఇండియన్ బోల్ట్‌కు కోచింగ్ ఇప్పిస్తాం..!
Send us your feedback to audioarticles@vaarta.com
జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ట్రాక్ రికార్డ్‌ను కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి బ్రేక్ చేశాడు. బోల్ట్ 100 మీటర్ల పరుగుని కేవలం 9.58 సెకన్లలో పూర్తి చేసి ట్రాక్‌పై సరికొత్త వరల్డ్ రికార్డ్‌లు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే బోల్ట్ కంటే వేగంగా కర్ణాటకకి చెందిన శ్రీనివాస గౌడ పరుగెత్తి అందర్నీ ఔరా అనిపించాడు. 100మీ పరుగుని 9.55 సెకన్లలో అందులోనూ బురద నీటిలో పూర్తి చేసి ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుని ‘భారత్ ఉసేన్ బోల్ట్’ అని పిలిపించుకున్నాడు. ప్రస్తుతం ఈ పేరు దేశమంతా మార్మోగుతోంది. నెటింట్లో చూసినా.. మీడియాలో చూసినా ఈయన పేరే వినపడుతోంది.
టాలెంట్‌ను గుర్తిస్తాం!
అయితే.. శ్రీనివాసకు మరింత శిక్షణ ఇప్పించి ఒలింపిక్స్‌కు పంపాలనే డిమాండ్ పెరిగింది. మరోవైపు ఆయనకు గోల్డ్ మెడల్ ఇవ్వాలనే డిమాండ్ కూడా పెరిగింది. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా తన ట్విట్టర్‌లో ప్రస్తావించారు. అయితే ఈ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. ‘శ్రీనివాస గౌడ ప్రదర్శన అద్భుతం. కోచ్‌ల ద్వారా గౌడను సాయ్ ట్రయల్స్‌కు రమ్మని పిలుస్తాను. చాలామందికి ఒలింపిక్స్ స్టాండర్స్ గురించి సరైన అవగాహన ఉండటం లేదు. ప్రత్యేకంగా అథ్లెటిక్స్‌లో శరీర ధృడత్వం కీలక పాత్ర పోషిస్తుంది. శరీర ధృడత్వంతో పాటు ఓర్పు కూడా అవసరం. దాంతోనే ఎన్నో ఘనతలు సాధించవచ్చు. భారత్‌లో టాలెంట్ నిరూపయోగంగా ఉండకూడదు’ అని కిరణ్ రిజుజు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.
ఆయనతో నాకు పోలికా!?
ఉసేన్ బోల్ట్‌తో పోల్చడం, ఇండియన్ బోల్డ్ అని శ్రీనివాసను ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ‘దేశంలోని ప్రజలు నన్ను ఉసేన్ బోల్ట్‌తో పోలుస్తున్నారు. అతను ఓ ప్రపంచ ఛాంపియన్. నేను కేవలం బురద పొలంలో మాత్రమే పరుగెత్తుతాను. దయచేసి ఆయనతో నన్ను పోల్చకండి.. ’ అని శ్రీనివాస చెప్పుకొచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments