ఉండవల్లి రీ ఎంట్రీ.. మంత్రి పదవి ఫిక్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ ఎంపీ, రాజకీయ ఉద్ధండుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా..? వైసీపీలో చేరాలనుకుంటున్నారా..? వైసీపీ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందా..? పిలిచి మరీ మంత్రి పదవి ఇవ్వడానికి వైసీపీ సిద్ధమైందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది.
ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైన తర్వాత చాలా మంది ఆ పార్టీకి చెందిన నేతల అడ్రస్ గల్లంతైంది!. కొందరు అటు టీడీపీలోకి.. ఇటు వైసీపీలోకి చేరగా మరికొందరు మాత్రం రాజకీయాలకు దూరమై సొంత బిజినెస్‌లు చూసుకుంటున్నారు. మరికొందరైతే ఇక రాజకీయాలొద్దు బాబోయ్ అంటూ కుటుంబ సభ్యులతో హాయిగా గడిపేస్తున్నారు. అయితే రాజకీయాలు బాగా వంటపట్టిన, రాజకీయ చాణక్యుడిగా పేరున్న ఉండవల్లి కూడా పూర్తిగా పాలిటిక్స్‌కు దూరమవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అప్పట్లో ఆయన కచ్చితంగా టీడీపీ లేదా వైసీపీ తీర్థం పుచ్చుకుని మళ్లీ యాక్టివ్ అవుతారని.. అవ్వాలని కూడా చాలా మంది కోరుకున్నారు. అయితే అది మాత్రం జరగలేదు. ఎన్నికల తర్వాత మళ్లీ ఉండవల్లి వార్తల్లో నిలిచారు.
విషయ పరిజ్ఞానం ఉన్న నేత, వైఎస్‌కు అత్యంత సన్నిహితుడనే పేరున్న ఉండవల్లిని వైసీపీలో చేర్చుకోవాలని అధినేత భావిస్తున్నారట. చేర్చుకోవడమంటే ఖాళీగానే కాదు.. మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. మొదట ఆయనకు కండువా కప్పి ఆహ్వానించాలని ఆ తర్వాత మిగతా విషయాలు చూద్దామని.. ఎలాగైనా సరే ఆయన్ను పార్టీలోకి తీసుకురావాలని ఓ ఇద్దరు ముఖ్యనేతలకు జగన్ బాధ్యతలు అప్పగించారట.
వైసీపీ ఉండవల్లిని ఎందుకు కోరుకుంటోంది..?
వైసీపీలో సీనియర్లకు కొదవలేదు.. ఒకట్రెండు కాదు ఏకంగా డబుల్ హ్యాట్రిక్ కొట్టి గెలిచి నిలిచన నేతలున్నారు. అపార అనుభవమున్న పెద్దలు కూడా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఉండవల్లినే వైసీపీ ఎందుకు ఆహ్వానిస్తోందన్న దానికి కొన్ని కారణాలున్నాయట. ఉండవల్లి వంటి సీనియర్ నాయకుల అవసరం భవిష్యత్తులో పార్టీకి అవసరమని.. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో దిట్టగా పేరుగాంచిన ఉండవల్లి ఎలాంటి పరిస్థితులనైనా చాకచక్యం చక్కదిద్దే వ్యక్తి గనుక ఆయన్ను లాక్కోవాలని వైసీపీ భావిస్తోందట. అందుకే మంత్రి పదవి ఇస్తామని ఉండవల్లికి వైసీపీ బంపరాఫర్ ఇచ్చిందట. అయితే ఉండవల్లి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా లేదా అన్నది త్వరలో తేలనుంది.
ఉండవల్లి స్పందన..
తాను వైసీపీ చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఉండవల్లి ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. వైసీపీలో చాలామంది సీనియర్ నేతలు, అనుభవజ్ఞులు ఉన్నారని.. గత కొన్ని రోజులు ఇలాంటి వార్తలు వస్తున్నాయని వాటిని నమ్మొద్దన్నారు. అంతేకాదు తాను రాజకీయాల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని.. కంపల్సరీ రిటైర్మెంట్ కాదన్నారు. కంపల్సరీ రిటైర్మెంట్ అంటే పనిష్మెంట్.. వాలంటరీ రిటైర్మెంట్ అంటే.. సింపుల్‌గా తనకు నచ్చిన పని చేస్తున్నానని.. అందే అందరితో మాట్లాడుతున్నామని ఉండవల్లి తేల్చిచెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout